మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..

కరోనాతో ఓడిన ‘విజయ’ం!
పుట్టినరోజు నాడే జూనియర్ అసిస్టెంట్ మృతి
సదాశివనగర్, ఏప్రిల్ 23 : మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవిత పోరాటంలో గెలిచిన ఓ యువతి.. కొవిడ్ మహమ్మారితో పోరాటంలో ఓడింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడికి చెందిన జాజావ్ గంగాధర్‌రావు మూడో కుమార్తె జాజావ్ విజయ (26) తాడ్వాయి తాసిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఆమె మూడు ఉద్యోగాలు సాధించి సత్తాచాటింది. మొదట అటవీశాఖ బీట్ ఆఫీసర్‌గా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు రాగా.. పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరారు. మల్లుపేట్లో ఉద్యోగం చేస్తూనే గ్రూప్-4 పరీక్ష రాసి రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికైంది. ఉద్యోగం రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు వారం క్రితమే కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లివచ్చారు. జ్వరం రావడంతో బుధవారం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించగా విజయతోపాటు తల్లి, అక్కకు కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం విజయకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా.. చికిత్సపొందుతూ మృతిచెందింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- junior assistant
- vijaya
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

