e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Evil eye jewelry | దిష్టి త‌గ‌ల‌కుండా ఈ ఆభ‌ర‌ణాలు ఎప్పుడైనా ధ‌రించారా?

Evil eye jewelry | దిష్టి త‌గ‌ల‌కుండా ఈ ఆభ‌ర‌ణాలు ఎప్పుడైనా ధ‌రించారా?

Evil eye jewelry
Evil eye jewelry

Evil eye jewelry | పాలబుగ్గల చిన్నారికి దిష్టి తగలకుండా నుదుటన దిద్దే కాటుక బొట్టు, ఆ బుజ్జాయిని మరింత ఆకర్షణీయంగా చూపుతుంది. సిగ్గులొలికే పెండ్లికూతురు బుగ్గన పెట్టే దిష్టి చుక్క, నవవధువును వరూధిని కన్నా మిన్నగా చూపుతుంది. కొన్నిరకాల ఆభరణాలూ దృష్టి దోషాన్ని తొలగిస్తాయని అంటారు. ప్రత్యేకించి ఈవిల్‌ ఐ నగలు ఆ సులక్షణ శోభితురాలికి రక్షణ కవచమై నిలుస్తాయని విశ్వాసం. దిష్టి, నరఘోష అనేవి ప్రాచీనకాలం నుంచీ ఉన్న నమ్మకాలే. మన దగ్గరే కాదు, ఇతర దేశాల్లోనూ ఈ తరహా విశ్వాసాలు అధికం. ఆ వక్ర దృష్టిని తప్పించుకునేందుకు మన దగ్గర దిష్టిబొమ్మలు, దిష్టిచుక్కలు, నల్లతాడు వంటివాటిని ఆశ్రయిస్తారు. విదేశాల్లో అయితే ప్రత్యేకంగా నీలిరంగు కన్ను పొదిగిన రకరకాల నగలు ‘ఈవిల్‌ ఐ జువెలరీ’ పేరుతో అందుబాటులో ఉన్నాయి.

ఎందుకు ధరించాలి?

మనిషి స్వార్థపరుడు. సాటి వ్యక్తి విజయాన్ని ఓర్వలేడు. పొరుగుజీవి ఆనందాన్ని తట్టుకోలేడు. కడుపులోని ద్వేషమంతా కంట్లో కనిపిస్తుంది. చూపుల ద్వారా ఆ విష కిరణాలు ‘ప్రతికూల శక్తి’ రూపంలో ఎదుటి మనిషి మీద దాడి చేస్తాయి. ఇదంతా మూఢ విశ్వాసంలా అనిపించినా, ఎవరి నమ్మకాలు వారివి. కాబట్టే, దిష్టి దోషాలను పట్టించుకునేవారు ‘ఈవిల్‌ ఐ’ ఆభరణాలను కొంటున్నారు. వీటిని ధరిస్తే అసూయ, నెగెటివ్‌ ఎనర్జీ నుంచి తప్పించుకోవచ్చని భావిస్తారు.

కానుకలుగా..

- Advertisement -

మనదేశంలోనూ ‘ఈవిల్‌ ఐ’ నగలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రసిద్ధ ఆభరణ తయారీ సంస్థలు కూడా ‘ఈవిల్‌ ఐ’ పొదిగిన బ్రేస్‌లెట్లు, పెండెంట్లు, జూకాలు, ఉంగరాలు, గాజులు తయారు చేస్తున్నాయి. వజ్రాలు, జాతిరత్నాలు జోడించిన నగలూ అందుబాటులో ఉన్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలతో కలిపి కూడా రూపొందిస్తున్నారు. ప్రేమికులు, బంధువులకు కానుకలుగా ఎంచుకుంటున్నారు.

రంగుకో ప్ర‌భావం

దృష్టి దోషం నగలు అన్ని వర్ణాల్లోనూ లభిస్తాయి. ఒక్కోరంగు వెనుక ఓ పరమార్థం ఉంటుంది. నీలిరంగు ధరిస్తే నిబద్ధత పెరుగుతుంది. పసుపు రంగు ధరిస్తే శక్తిసామర్థ్యాలు రెట్టింపు అవుతాయి, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. నారింజ రంగు ధరిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. ఎరుపు రంగు ధరిస్తే అభద్రతాభావం దూరం అవుతుంది. ఆకుపచ్చ రంగు ధరిస్తే కొత్త ఆలోచనలు పెరుగుతాయి. తెలుపు రంగు ధరిస్తే ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

zirconium | న‌గ‌లంటే బంగార‌మే.. ఈ లోహంతో త‌యారుచేసిన ఆభ‌ర‌ణాలే ఇప్పుడు ట్రెండింగ్‌

snatch bun | స్నాచ్ బ‌న్ కొప్పు వేసుకోవడం అంత క‌ష్ట‌మా?

Christmas Special | ఈ క్రిస్మ‌స్‌కు ప్ర‌త్యేకంగా క‌నిపించాలా? ఈ డిజైన్ల‌ను ట్రై చేయండి

Fashion | పార్టీలు, ఫంక్ష‌న్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్‌

అందం.. అధికారానికి చిహ్నం.. అర‌బ్ న‌గ‌లు.. హైద‌రాబాద్‌కి ప్ర‌త్యేక అనుబంధం

netted fabric | సంప్ర‌దాయంతో పాటు గ్రాండ్ లుక్‌.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌దే హ‌వా..

bandhani fashion | ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్‌.. స్క‌ర్ట్స్‌, లెహంగా అన్ని వీటితోనే..

fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాష‌న్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement