zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్

Zirconium | కళ్లు జిగేల్మనిపించే నగలు వేసుకుని నలుగురిలో మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అందుకు తగినట్టు వజ్రాలు, రాళ్లు, రత్నాలు పొదిగిన నగలు కొనాలంటే మాత్రం అందరికీ సాధ్యపడదు. అలాంటి వారికోసమే రకరకాల లోహాలతో చేసిన కొత్తకొత్త నగలు పుట్టుకొస్తున్నాయి. జిగేల్ మెరుపులతో ఆధునిక మగువల మనసు దోచుకుంటున్న జిర్కోనియం నగల ధగధగలేంటో చూద్దాం..

ఆభరణాలంటే బంగారంతో చేసినవి అనేది పాతమాట. ఇప్పుడు రకరకాల లోహాలతో చేసిన నగలు బంగారాన్ని మించిన మెరుపుతో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అసలైన ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని ఈ నగల నిగనిగలకు దాసోహమంటున్నారు ఈ తరం అతివలు. సంప్రదాయంతోపాటు నాగరికతను మేళవించిన జిర్కోనియం ఆభరణాలు ధరించేందుకు మోజుపడుతున్నారు. మిగతా లోహాలతో పోలిస్తే దీనికి దృఢత్వం ఎక్కువ. అందుకే దీన్ని కృత్రిమ దంతాలు, కృత్రిమ ఎముకల తయారీలో వాడుతారు. దీని మెరుపు, దృఢత్వం కారణంగా ప్రస్తుతం నగల తయారీలోనూ భాగమవుతున్నది.

అన్నిరంగుల్లోనూ..
జిర్కోనియం, టైటానియం ఖనిజాలను సోదర ధాతువులుగా పరిగణిస్తారు. వీటి మిశ్రమంతో తయారుచేసిన నగలు దృఢంగా ఉంటాయి. నిజానికి ముడి జిర్కోనియం ఏ రంగునూ కలిగి ఉండదు. కానీ దీన్ని వివిధ లోహాలతో వివిధ ప్రక్రియల్లో రసాయనిక చర్య జరపడం వల్ల నలుపు, తెలుపు, నీలం, ఊదా.. ఇలా రకరకాల వర్ణాల్లోకి మారుతుంది. ఫలితంగా తక్కువ ధరలోనే వినూత్నమైన నగలు అందుబాటులోకి వస్తున్నాయి. జాతిరత్నాలకు తీసిపోని రాళ్లను పొదిగిన రంగురంగుల నగలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఎక్కువగా వీటికి రోజ్‌గోల్డ్, వజ్రాలు జతచేసి పెండ్లి, నిశ్చితార్థం ఉంగరాలను తయారు చేస్తున్నారు.

నలుపు జతగా..
ఆడవాళ్ల ఆభరణాల్లో నలుపురంగుది ప్రత్యేకస్థానం. దిష్టి తగలకుండా ఒంటిమీద ఏదో ఒక నలుపు ఆభరణాన్ని ధరిస్తారు. అయిదోతనానికి గుర్తుగా మంగళసూత్రంలోనూ నల్లపూసలు జతచేస్తారు. అందుకే జిర్కోనియంతోనూ నలుపు రంగు ఆభరణాలు తయారుచేస్తున్నారు. ఉంగరాలు, గాజులు, బ్రేస్లెట్లు, వాచ్బెల్టులు, సన్నటి గొలుసులు.. ఇలా ఒకటేమిటి ఆపాదమస్తకం అలంకరించుకునే అన్ని ఆభరణాలూ సిద్ధం చేస్తున్నారు.

వెండికి బదులు..
ఆభరణాల తయారీలో వెండికి బదులుగా జిర్కోనియాన్ని ఎక్కువగా వాడతారు. మెరుపు కారణంగా ఎంత చిన్న నగ అలంకరించుకున్నా అందరిలోనూ ఆకట్టుకునేలా తళుక్కుమంటారు. తేలికగా ఉండటం వల్ల ఎన్ని నగలు వేసుకున్నా, ఎంత పెద్ద ఆభరణమైనా ఇబ్బంది ఉండదు. సంప్రదాయ దుస్తులపై ధరించేందుకు వీలుగా పెద్దపెద్ద చోకర్లు, హారాలతోపాటు వెస్ట్రన్వేర్పై నప్పేలా సన్నటి, చిన్నచిన్న నగలూ అందుబాటులో ఉన్నాయి. పైనుంచి కిందివరకు ఒకే థీమ్‌తో అలంకరించుకునేలా కాంబో ఆఫర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

