అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
arab jewellery | భారీతనం.. కళాత్మకత.. సంప్రదాయ ముద్ర.. అరబ్ నగల ప్రత్యేకత. అరబ్బులు నగలను అందానికి, అధికారానికి, దర్పానికి చిహ్నంగా భావిస్తారు. ఆపాద మస్తకం అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. ఆ డిజైనింగ్‌లో కాలిగ్రఫీకి ప్రాధాన్యం ఉంటుంది. లతలూ పూలూ అందంగా ఒదిగిపోతాయి. అరబ్ దేశాలతో హైదరాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో అరబ్ ఘుమఘుమలే కాదు, ధగధగలూ మనల్ని సమ్మోహితులను చేస్తున్నాయి.

అరబ్ దేశాల్లో ఐశ్వర్యం ఎక్కువ. సౌందర్య పిపాస కూడా ఎక్కువే. అక్కడి మహిళలు ధరించే నగల్లోనూ ఆ భారీతనంతో కూడిన పనితనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒంటినిండా నగలు ధరించేందుకు మక్కువ చూపుతారు. అందుకే, రకరకాల నగలు అందుబాటులో ఉన్నాయి. పెద్దపెద్ద హారాలు, పట్టీలు, తొడుగులు అరబ్బుల నగల్లో మరీ ప్రత్యేకం. మనతో పోలిస్తే రాగి వాడకం తక్కువ. మేలిమి బంగారంతోనే తయారు చేస్తారు. అందుకే, ఆ ఆభరణాలు పచ్చని పసిమితో మెరిసిపోతాయి.
అదిరిపోయే డిజైన్లు..
సౌదీ అరేబియా, దుబాయ్, ఒమన్ మహిళలు ధరించే నగల్లో చంద్రవంకలు, నక్షత్రాల డిజైన్లు అధికం. ప్రకృతి ప్రతిరూపాలైన ఆకులు, పువ్వులు, తీగలు ఆ డిజైనింగ్‌లో ఒదిగిపోతాయి. జాతి రత్నాలను పొదగడం అరుదు. సముద్ర నీలం, గులాబి రంగు రాళ్లను మాత్రం ఇష్టంగా జోడిస్తారు.
హారాలు.. గొలుసులు..
అరబ్ నగలు పట్టీలు పట్టీలుగా, దొంతరలు దొంతరలుగా విస్తరించి ఉంటాయి. తమ పేర్లను, ప్రేమను తెలిపే కవితాత్మక వాక్యాలను పొదిగిన పెండెంట్లు, గాజులు ప్రేమగా ధరిస్తారు. ప్లాటినం, డైమండ్ నగలనూ ఎక్కువగా ఇష్టపడతారు.
పలుచని రేకుల్లా..
అరబ్ నగల్లో ప్రత్యేకంగా నిలిచేవి లోలాకులు. ఆకారంలో పెద్దగా ఉన్నా పలుచని రేకుల్లాంటి డిజైన్లలో రూపొందడంతో తేలిగ్గానే ఉంటాయి. పెద్దపెద్ద హ్యాంగింగ్స్ వేసుకున్నా ఇబ్బందేమీ ఉండదు. మన సంప్రదాయ చీరకట్టుపైనా ఈ నగలు చక్కగా నప్పుతాయి.
హైదరాబాద్‌లోనూ..
పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో తయారయ్యే అరబ్ నగలంటే హైదరాబాదీలకూ మక్కువే. దీంతో పాతబస్తీ నగల దుకాణాల్లో అన్ని రకాల అరబ్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Fashion | ఒకప్పుడు లంగా ఓణీలు.. కానీ ఇప్పుడు స్కర్ట్లే ఫ్యాషన్ !!
antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
Fashion | గేల్మనిపించే ఈ సిల్క్ డిజైన్ల చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

