fashion silk sarees | కొత్త కొత్త ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా చీరకట్టు ఎవర్గ్రీన్. ఆధునిక సొబగులద్దుకున్న చీరలంటే మగువలకు మహా క్రేజ్. చూడగానే కండ్లు జిగేల్మనిపించే సిల్క్ డిజైన్లను మరింత ఇష్టపడతారు.
పర్పుల్, గులాబీ రంగు కాంబినేషన్లో డిజైన్ చేసిన చీర ఇది. పర్పుల్ కలర్ ప్యూర్ సిల్క్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌కు రెండించుల గోల్డ్ బార్డర్‌ను జతచేశారు. బాడీపార్ట్లో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ సిల్క్ త్రెడ్ వర్క్ బాగా హైలైట్ అయ్యింది. నిండు రంగు చీరకు నప్పేలా పింక్ కలర్ బ్లౌజ్ ఎంచుకున్నారు. ట్రెండీ లుక్‌కోసం రఫుల్స్‌తో చిన్న హ్యాండ్స్ ఇచ్చారు. నైట్ పార్టీలకు ఈ డిజైన్ చక్కని ఎంపిక.
ముద్దబంతిని తలపించే నిండైన పసుపు కలర్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. చీరను డామినేట్ చేయకుండా బార్డర్లో సన్నటి పైపింగ్ ఇచ్చారు. బాడీపార్ట్ హైలైట్ అయ్యేలా పింక్, గ్రీన్, వైట్ కలర్ సిల్క్ దారాలతో కుందన్లు జతచేసి ఆకులు, పువ్వుల డిజైన్‌తో మగ్గం వర్క్ చేశారు. చీరకు నప్పేలా బ్లూ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ఇచ్చారు. హాఫ్ హ్యాండ్స్, ఓపెన్ నెక్‌తో మోడ్రన్ లుక్ వచ్చింది. ట్రెండీగా ఉండాలనుకునేవారికి నచ్చే డిజైన్ ఇది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Fashion | పట్టుచీరలో.. దీప లక్ష్మి
Hair color | కోరుకున్న రంగు కురులకు హంగు