Hair color | కోరుకున్న రంగు కురులకు హంగు

జుట్టు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని రకరకాల హెయిర్ డైలు వేసుకుంటున్నది నేటి యువత. దీనికోసం రసాయనాలతో చేసిన రంగులు వాడుతున్నారు. కానీ, ఇవన్నీ ప్రమాదకరం. సహజ సిద్ధమైన హెయిర్డైలతోనూ జుట్టు కోరుకున్న రంగులోకి వస్తుంది. కుదుళ్లు గట్టిపడి, జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి.
మందారం: ఎక్కువమంది ఇష్టపడే రంగు ఇది. ఎరుపు రంగు జుట్టు కావాలంటే, మందార పూలను ఉపయోగించాలి. ఒక కప్పు నీళ్లలో కొన్ని పూలు వేసి అరగంటసేపు సన్నటి మంటపై మరిగించాలి. చల్లారాక, దాన్ని జుట్టుకు పట్టించాలి. రెండు గంటల తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి.
ఎర్ర క్యాబేజీ : జుట్టు రంగు మార్చేందుకు ఈ ఎర్ర రంగు క్యాబేజీ ఉపకరిస్తుంది. ముందుగా సగం క్యాబేజీని తరిగి, నీళ్లలో మరిగించాలి. అందులో కాస్తంత ఉప్పు, వెనిగర్ వేయాలి. చల్లారిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, ఇరవై నిమిషాలయ్యాక కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే, జుట్టుకు గులాబి రంగు షేడ్ వస్తుంది.
బీట్రూట్ : బర్గండీ కలర్‌ను ఇష్టపడేవాళ్లు బీట్రూట్ను ప్రయత్నించొచ్చు. బీట్రూట్ తరుగును ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ తేనెలో వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కనపెట్టి, తర్వాత దాన్ని మాడుకు, జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇందులో కొద్దిగా దానిమ్మ గింజల రసం కూడా కలుపుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Hair color
- hair style
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

