గులాబీ మెరుపులు
‘ఓహో గులాబి బాలా..’ అంటూ సొగసరిని గులాబీతో పోలుస్తారు. ఆ పువ్వుల అందం, సున్నితత్వం మగువల ఆహార్యానికి చక్కగా సరిపోతాయి. రోజూ పూచే రోజా పువ్వంటే ఆడపిల్లలకూ లవ్వే!అందుకే గులాబీలకు, ఆ రంగుకు ఎంతో విలువిస్తారు అతివలు. కురుల్లో చోటివ్వడమే కాదు ధరించే దుస్తుల్లో, అలంకరణ వస్తువుల్లోనూ అగ్రస్థానం గులాబీ సొగసులదే! వీటికి జోడీగా ఇప్పుడు గులాబీ రంగు నగలు (రోజ్ గోల్డ్) ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. గులాబీ నగల ధగధగ లేంటో మనమూ చూద్దాం..

గులాబీ రంగు నగలు ఇటీవల పుట్టుకొచ్చిన ఫ్యాషన్ కాదు. 19వ శతాబ్దం తొలినాళ్లలోనే రష్యాలో గులాబీ రంగు నగలను వాడినట్లు తెలుస్తున్నది. అందుకే దీనికి ‘రష్యన్ గోల్డ్’ అనే పేరు కూడా ఉంది. ముఖ్యంగా ప్రేమను వ్యక్తీకరించడానికి ప్రియురాలికి బహుమానంగా గులాబీ రంగు ఉంగరాలను బహుమానంగా ఇచ్చేవారట. రానురాను అది కాస్తా ఫ్యాషన్‌గా మారి అన్ని రకాల నగలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతులు కొత్తపుంతలు తొక్కుతున్నట్టే ఈ గులాబీ రంగు నగలు కూడా ఆధునిక హంగులద్దుకొని మళ్లీ అతివలకు చేరువయ్యాయి.
రోజ్ గోల్డ్ అంటే..?
స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు తయారుచేయడం కుదరని పని. బంగారానికి సాగే గుణం తీసుకురావడానికి కొద్దిమొత్తంలో రాగిని కలుపుతారు. పసిమి ఛాయ తగ్గకుండా పసిడి ఆభరణాలు రూపొందిస్తారు. వివిధ రంగుల్లో నగలు తయారు చేయడానికి బంగారంలో పలు రకాల మిశ్రమాలను కలుపుతారు. స్వచ్ఛమైన బంగారంలో కలిపే ఇతర లోహాల మోతాదును బట్టి దాని రంగు మారుతుంది. కొద్దిమోతాదులో రాగిని కలిపి ఎల్లో గోల్డ్, వెండిని కలిపి వైట్ గోల్డ్, ఎక్కువ మొత్తం (25 శాతం)లో రాగిని కలిపి ‘రోజ్ గోల్డ్’ నగలను తయారు చేస్తారు. రోజ్ గోల్డ్‌నే రెడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇవి మెరుపులోనూ, మన్నికలోనూ బంగారు నగలకు ఏమాత్రం తీసిపోవు. రాగి కలిపినా బంగారం మోతాదు ఎక్కువ కాబట్టి ఆభరణాలు నల్లబడవు.
ఆధునికతకు చిహ్నంగా..
పెండ్లిళ్లు, పండుగలు, పూజలు, వ్రతాలు వంటి శుభకార్యాల్లో పట్టుదుస్తులు ధరించి వాటికి నప్పేలా పెద్దపెద్ద బంగారు నెక్లెస్‌లు, హారాలు వేసుకోవడం మన సంప్రదాయం. కానీ, మారుతున్న కాలానికి, ఫ్యాషన్లకి తగ్గట్టుగా అలంకరించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఆధునిక మహిళలు. అందుకే సంప్రదాయంతోపాటు సౌకర్యంగా ఉండేలా దుస్తులు, నగలను ఎంచుకుంటున్నారు. ఫ్యాన్సీ, వెస్ట్రన్ మోడల్స్‌కి నప్పేలా తేలికైన నగలు ధరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాంటి దుస్తులపైకి అయినా నప్పేవిధంగా చిన్నచిన్న వజ్రాలు, రాళ్లు పొదిగిన రోజ్ గోల్డ్ నగలు ధరిస్తున్నారు. సాధారణ ఆభరణాలకు భిన్నంగా ఉండటంతో నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
అన్నీ అందంగా..
బంగారంతో పోల్చుకుంటే రోజ్ గోల్డ్ నగలు తక్కువ ధరలో లభిస్తాయి. మెరుపులో బంగారానికి ఏమాత్రం తీసిపోవు. వీటిలో అమర్చే చిన్నచిన్న రాళ్లు, వజ్రాలు ఈ నగలను మరింత అందంగా కనబడేలా చేస్తాయి. సన్నగా, నాజూకుగా ఉండే ఈ ఆభరణాలను అన్ని వయసులవారు ధరించే వీలుంటుంది. ముఖ్యంగా యువతులను ఇవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సన్నటి గొలుసులు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, గాజులు, లాకెట్లు వెస్ట్రన్ వేర్‌పై చక్కగా నప్పుతాయి. సంప్రదాయ దుస్తులపై అలంకరించుకునేందుకు పెద్దపెద్ద నెక్లెస్‌లు, జుంకాలు, హారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

