Fashion | పట్టుచీరలో.. దీప లక్ష్మి

పండుగంటే సంస్కృతి, సంప్రదాయాల సమాహారం. అందుకే చక్కని సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటారు మగువలు. ఎన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చినా దుస్తుల్లో మాత్రం చీరలదే హవా. లక్ష్మీదేవిని తలపించేలా గృహలక్ష్మికి దీపావళి కళ తెచ్చే డిజైన్లేమిటో చూద్దాం..
నీలాల జాబిల్లి
నీలిరంగు వెంకటగిరి కాటన్ సిల్క్ చీర ఇది. ప్లెయిన్ బ్లూ కలర్ చీరకు పది ఇంచుల సిల్వర్ కలర్ బార్డర్ జతచేశారు. పల్లు, హాఫ్ శారీ బార్డర్‌పై పింక్ కలర్ త్రెడ్ వర్క్‌తో హైలైట్ చేశారు. చీర కలర్‌కు కాంట్రాస్టింగ్‌గా గ్రీన్ కలర్ ఇక్కత్ బ్లౌజ్ ఇచ్చారు. చిన్న పఫ్స్‌తో మోచేతుల వరకు ఇచ్చిన హ్యాండ్స్ హుందాగా అనిపిస్తాయి. సింపుల్‌గా, కళగా ఉన్న ఈ చీర పూజలు, వ్రతాల్లో కట్టుకునేందుకు చక్కగా ఉంటుంది.
గులాబీ సొగసుతో..
పర్పుల్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన చీర ఇది. పర్పుల్ కలర్ వెంకటగిరి సిల్క్ ఫ్యాబ్రిక్‌కు పది ఇంచుల పింక్ అండ్ సిల్వర్ కలర్ పితానీ వర్క్ బార్డర్‌ను జతచేశారు. చీరంతా చిన్న బుటీస్‌తో లైన్స్ ఇచ్చి పల్లు మొత్తం బుటీస్ ఇచ్చారు. చీరకు కాంట్రాస్టింగ్‌గా పింక్, పర్పుల్ కలర్ బుటీస్ ఉన్న ఇక్కత్ బ్లౌజ్ డిజైన్ చేశారు. నిండైన డిజైన్లు, రంగుల మేళవింపుతో శుభకార్యాల్లో కట్టుకోవడానికి బాగుంటుంది.
మోడల్: ప్రియ
డిజైనర్: నిహారికా రెడ్డి
ఫోన్: 9052224949, @Shreevaidikisilks Facebook.com.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fashion
- pattu saree
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

