fashion | ట్రెండ్స్ ఫాలో అవుతూ, ఫ్యాషనబుల్‌గా కనిపించాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ప్రత్యేక సందర్భాల కోసం సరికొత్త డిజైన్లు ఎంచుకుంటుంది. సంప్రదాయ లెహంగాలకు తీసిపోకుండా, ఈతరం అమ్మాయిల మనసులు దోచేస్తున్న నెట్టెడ్ డిజైన్లేమిటో చూద్దాం..
విరిసిన పూబాల..
చూడగానే కళ్లు చెదిరేలా లెమన్ ఎల్లో కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. సేమ్ కలర్ శాటిన్ ఫ్యాబ్రిక్‌తో డబుల్ లేయర్ ఇన్నర్ కవర్ ఇచ్చారు. లెహంగా మొత్తం గోల్ ్డకలర్తో ఇచ్చిన బుటీస్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. చిన్నగా ఇచ్చిన సిల్వర్ బార్డర్ లెహంగాకు మరింత అందాన్ని తెచ్చింది. క్రాప్టాప్కోసం సిల్వర్ టిష్యూ
ఫ్యాబ్రిక్‌పై ఎల్లో, ఆరెంజ్ కలర్స్‌తో త్రెడ్ వర్క్ చేశారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఫుల్లెన్త్ పఫ్ హ్యాండ్స్ ట్రెండీగా కనిపిస్తున్నాయి, ఇట్టే ఆకర్షిస్తున్నాయి.
సీతాకోక చిలుకలా..
ఉల్లిపొరలాంటి లైట్ బ్లూ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. చక్కని లుక్‌కోసం పైపింగ్ చేశారు. అదే రంగు శాటిన్, కాటన్ ఫ్యాబ్రిక్‌తో రెండు లేయర్స్ ఇవ్వడంతో కలర్ ఎలివేట్ అయ్యింది. లెహంగాకు నప్పేలా వైట్ కలర్ క్రాప్టాప్పై నీలం, ఆకుపచ్చ ఆకులు, పూలతో త్రెడ్ వర్క్ చేసి బుటీస్ ఇచ్చారు. లెహంగాకు కాంట్రాస్టింగ్‌గా అదే రంగు నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ట్రెండీ హ్యాండ్స్ డిజైన్ చేశారు. పఫ్స్తోపాటు చివర్లో కట్స్ ఇచ్చి వదిలేయడంతో బటర్ ఫ్లై లుక్ వచ్చింది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Fashion | గేల్మనిపించే ఈ సిల్క్ డిజైన్ల చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు