ఫ్యాషన్ రంగంలో ఇప్పుడామె ఓ ట్రెండ్ సెట్టర్.. తొమ్మిదేళ్ల క్రితం ధైర్యం చేయకపోయుంటే మాత్రం..

falguni nayar | స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలిరోజు నుంచే సంచలనాలు సృష్టిస్తున్నది.. నైకా.కామ్ ( www.nykaa.com ) షేర్. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ స్వయం శక్తితో ఎదిగిన అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ఈ విజయం ఓ మగువ పోరాట స్ఫూర్తికి నిదర్శనం. నడి వయసులోనూ అద్భుతాలు చేయవచ్చనడానికి తార్కాణం.
ఫల్గుణీ నాయర్ ఐఐఎమ్ – అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. తొమ్మిదేండ్ల క్రితం నైకాను స్థాపించారు. అంతకు ముందు, దాదాపు రెండు దశాబ్దాలు కోటక్ మహీంద్రా బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా సేవలందించారామె. ఉద్యోగంలోంచి బయటికొచ్చి స్టార్టప్ స్థాపించే నాటికి తనకు సాంకేతికత మీద పెద్దగా పట్టు లేదు. అయినా సరే ధైర్యం చేశారు. మొదట్లో రోజుకు ఇరవై ఆర్డర్లు కూడా వచ్చేవి కాదు. ఈ తొమ్మిదేండ్లలో సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ), ఫ్యాషన్ మార్కెట్లో నైకా వేళ్లూనుకుంది. ఇప్పటికే 50 లక్షల వినియోగదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 70 స్టోర్లు లాభదాయకంగా నడుస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షల మంది నైకాను అనుసరిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల సూచిక ప్రకారం దాదాపు 7.5 బిలియన్ డాలర్ల (56 వేల కోట్ల రూపాయలు) సంపదతో ఫల్గుణి సంపన్న భారతీయ మహిళలలో రెండో స్థానంలో ఉన్నారు. ‘నేను నా 50వ ఏట నైకాను మొదలుపెట్టాను. మీరూ మీ జీవితాల్లో నాయికలు అయ్యేందుకు నా ప్రయాణం స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నా’ అంటారు ఫల్గుణి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
darpan ahluwalia | పోలీస్ అకాడమీలో పరేడ్ కమాండర్‌గా నడిపించబోతున్న ఈమె గురించి తెలుసా
ekta kapoor | మరో కొత్త బిజినెస్‌లోకి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్
mahesh bigala | చదివిన బడిని మరువని ప్రవాసీ.. కోటి రూపాయలు పెట్టి మరీ అభివృద్ధి
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ!
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

