Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరగనున్నదని, ఆ ప్రక్రియ చాలా దగ్గరగా వచ్చినట్లు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
న్యూయార్క్: కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్, అమెరికా చాలా దగ్గరగా వచ్చినట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమతో డీల్ కుదుర్చుకోవాలని భారత్‌కు ఉందని, మేం ఇక ఆ ఒప్పందం కుదుర్చకుంటామని, ఆ అంశం చాలా దగ్గరపడిందన్నారు. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇండియాలో పర్యటిస్తున్న నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై రూబియా దృష్టిపెట్టారు. వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ, రక్షణ రంగాల్లోనూ రెండు దేశాలు సహకారం అందించుకోనున్నాయి. ఈ నెల మొదట్లో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. అమెరికా ట్రేడ్ ప్రతినిధులను కలిశారు. జేమిసన్ గ్రీర్ అనే వ్యక్తిని ఆయన అమెరికాలో కలిసిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ తొలి దశ వివరాలపై ఫిబ్రవరిలోనే రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. అయితే పన్నుల విధింపులో అమెరికా మార్పులు చేయడంతో మరోసారి వాణిజ్య డీల్‌పై చర్చలు చేపట్టాల్సి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

