jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
jai bhim fame Lijomol Jose | ఒకే ఒక్క సమాధానం కోసం ఎదురుచూసిన ఆమె కండ్లు.. ఇప్పుడు సమాజానికి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాయి. ఆ చూపులో ఆశలు ఒలికాయి, ఆవేశం పెల్లుబికింది, ఆవేదన కన్నీళ్లుగా ధారకట్టింది.ఆమె సంధించిన ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో దొరక్క పోవచ్చు. కానీ, ఆ చూపుల్లో పలికిన భావాలను మాత్రం ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తున్నారు. తెలియకుండానే గుండె బరువెక్కిన భావనకు లోనవుతున్నారు. ఇందరిని ఇంతలా ఆలోచింపజేసినవి.. ‘ చినతల్లి ’ కండ్లు. ‘జై భీమ్’ సినిమాలో ఆ పాత్ర పోషించిన లిజోమోల్ జోసీ కండ్లు అవి.

‘జై భీమ్’ సినిమా చూస్తున్నంత సేపూ.. ‘ఎవరీమె?’ అన్న ప్రశ్నే. చినతల్లి పాత్రలో అంత గొప్పగా నటించింది. ‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమాలో ‘రాజలక్ష్మి’ పాత్ర పోషించిందీ తనే. భర్త, తమ్ముడి మధ్య నలిగిపోతున్న యువతిగా లిజోమోల్ జోసీ నటనను చూసి ‘జై భీమ్’ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. లిజో పుట్టింది కేరళలో. చదువూ అక్కడే. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్‌లో పీజీ చేసింది. ఆసక్తి కొద్దీ ఓ టెలివిజన్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది.అనుకోకుండా ‘మహేశింటే ప్రతీకారం’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది.
2016లో మొదలైన లిజో నట ప్రస్థానం నిదానంగానే సాగింది. మలయాళంలో నాలుగైదు సినిమాలు చేసింది. 2018లో ‘శివప్పు మంజల్ పచ్చాయి’ తమిళ చిత్రం బ్రేక్ ఇచ్చింది. అదే తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదలైంది. తాజాగా వచ్చిన ‘జై భీమ్’ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీకే పరిమితమైనా లిజో ‘ఓవర్‌నైట్ స్టార్’గా మారిపోయింది. సూర్య, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్ వంటి పెద్ద స్టార్ల మధ్య కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. కొన్నిచోట్ల డామినేట్ చేసింది కూడా.
అనుకోకుండా ఒకరోజు ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మా సినిమాలో మంచి పాత్ర ఉంది చేస్తారా?’ అని అడిగారు. కథ విన్నాక ఓకే చెప్పకుండా ఉండలేకపోయాను. కానీ, నాకు తమిళం అస్సలు రాదు. అంతకుముందు ఓ తమిళ చిత్రం చేసినా భాష మీద పట్టురాలేదు. ఇదే మాట జ్ఞానవేల్‌తో చెప్పాను. కష్టపడి తమిళం నేర్చుకోమని సూచించారు.
ఒకరోజు దర్శకుడు పిలిపించారు. ‘ఇందులో న్యాయవాది పాత్ర ఎవరు పోషిస్తున్నారో తెలుసా?’ అని అడిగారు. ప్రకాశ్‌రాజ్ లాంటి కాస్త పెద్దవాళ్లు చేస్తారేమో అనుకున్నా. ‘సూర్య గారు’ అని చెప్పేసరికి ఆశ్చర్యం కలిగింది. కథ మీద దర్శకుడికి ఎంత నమ్మకం అంటే.. సూర్యలాంటి స్టార్ హీరో ఉన్నా, ఆ పాత్రకు ఫ్లాష్‌బ్యాక్, లవ్‌ట్రాక్ వంటివేవీ పెట్టలేదు. డ్యుయెట్ కూడా లేదు. నిఖార్సయిన కథను అంతే నిజాయతీగా తీశారు. అందుకే, మేం ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణ వస్తున్నది. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు.
ఈ సినిమాలో నేను, మణికంఠన్ ఆదివాసీ దంపతులుగా నటించాం. వారి జీవన శైలి, మాటతీరు, కట్టూబొట్టూ నేర్చుకోవడానికి ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాం. కొంతకాలం ఆదివాసీల మధ్యే గడిపాం. పూరిగుడిసెలోనే ఉండేవాళ్లం. చివరికి ఎలుకలు పట్టడం కూడా నేర్చుకున్నాం. ఆ సమయంలోనే, తమిళం నేర్చుకోవడంలో మణి చాలా సాయం చేశారు. నేను అడవి బిడ్డగా పూర్తిగా మారిపోతేనే పాత్రకు న్యాయం చేయగలను అనిపించింది. ఆ ప్రయత్నంలో విజయం సాధించాననే తృప్తి ఉంది.
ఈ సినిమాలో నేను ఏడ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. చెప్తే నమ్మరు కానీ, ఒక్క సీన్లోనూ గ్లిజరిన్ ఉపయోగించలేదు. చినతల్లి నన్ను ఎంతగా ఆవహించేదంటే.. దర్శకుడు కట్ చెప్పాక కూడా అలాగే ఏడుస్తూ ఉండిపోయేదాన్ని. డబ్బింగ్ సమయంలోనూ కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టుకున్నా. ఆ పాత్రతో నా అనుబంధం అంత బలమైంది.
ఈ సినిమా గురించి పదిమందీ మాట్లాడుకుంటూ ఉంటే సంతోషంగా ఉంది. నా పాత్రకూ మంచి ఆదరణ వస్తున్నది. కానీ, ఇలాంటి పాత్ర మళ్లీ చేయాలని లేదు నాకు. అలా అని, ఇష్టం లేక కాదు. ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం నా స్వభావానికి విరుద్ధం. భిన్న పార్శాలు ఉన్న క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని మలయాళ సినిమాల్లో నటిస్తున్నా. అవన్నీ వేటికవే భిన్నమైన పాత్రలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jai bhim : ఈ సినిమా వెనుకున్న అసలు హీరో ఎవరంటే..?
lijomol jose | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
Jai bhim | ఇదే కదా సూర్య.. నీ నుంచి మేం కోరుకునేది అంటున్న ఫ్యాన్స్..
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

