Jai bhim | ఇదే కదా సూర్య.. నీ నుంచి మేం కోరుకునేది అంటున్న ఫ్యాన్స్..

Suirya jai bhim movie | తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 2న విడుదలైన జై భీమ్ సినిమా చూసిన తర్వాత.. అభిమానులు అంటున్న మాట ఇదే. తన సినిమాలో థియేటర్లో విడుదల చేయడం లేదనే ఒకే ఒక్క బాధ తప్పితే సూర్య చేస్తున్న సినిమాలు చూసి అందరూ ఆహా ఓహో అంటున్నారు. రెండేళ్ల కింది వరకు వరస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన సూర్య.. గత ఏడాది నుంచి పుంజుకున్నాడు. ఆకాశం నీ హద్దురా సినిమాతో గతేడాది సంచలన విజయం అందుకొన్నాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్భుతమైన విజయం సాధించింది.

ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా ఆకాశం నీ హద్దురా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు అవార్డులు కూడా అందుకున్నాడు సూర్య. సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు తమిళంతో పాటు హిందీలో కూడా విజయం అందుకుంది. ఈ ఏడాది మరోసారి తన సినిమాను డిజిటల్ మీడియాలోనే విడుదల చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్స్ ఎంత వరకు వస్తాయి అనేది ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమాలు థియేటర్లలో విడుదల చేసి నష్టాల పాలయ్యే కంటే.. కూడా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేయడం నయం అంటున్నారు సూర్య.
ఈయన తీసుకున్న నిర్ణయంపై థియేటర్స్ సంఘం అతనిపై గుర్రుగా ఉన్న కూడా.. తనకు ఉన్న సమస్యలు వాళ్లు వచ్చి తీర్చరు కదా అంటూ నేరుగా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సూర్య నటించిన జై భీమ్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సూర్య లాంటి స్టార్ హీరో తన ఇమేజ్ పక్కనపెట్టి.. ఈ తరహా కథలో నటించడం నిజంగా అభినందనీయం. చెంచులు, అంటరానివాళ్ల కోసం నిలబడే ఒక న్యాయవాది కథ ఇది. వాళ్లకు న్యాయం చేసే వరకు అతని పోరాటం ఎలా సాగింది అనేది జై భీమ్ కథ. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. థియేటర్లలో విడుదల అయి ఉంటే కచ్చితంగా సినిమాకు మరింత క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సూర్య నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏదేమైనా కూడా జై భీమ్ సినిమా చూసిన తర్వాత.. ఇలాంటి సినిమాలే కదా నీ నుంచి మేము కోరుకునేది అంటూ ఎమోషనల్ అవుతున్నారు సూర్య ఫ్యాన్స్. మరి రాబోయే సినిమాలను ఎలా డిజైన్ చేసుకుంటాడో చూడాలి ఈ హీరో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
Jyothika: సూర్యకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. దాని వలన నేను స్ట్రెస్ ఫీలవుతుంటా: జ్యోతిక
Balakrishna in Hospital | బాలకృష్ణకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం.. షూటింగ్కు ఎప్పుడొస్తాడు..?
రజినీకాంత్, నయనతార లేకుండానే పెద్దన్న ప్రమోషన్స్..
Samantha | సమంత చేసిన పనికి అంతా షాక్.. గే పెళ్లికి సపోర్ట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

