Balakrishna in Hospital | బాలకృష్ణకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం.. షూటింగ్‌కు ఎప్పుడొస్తాడు..?

Balakrishna in Hospital | టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనే విషయం తెలిసిన వెంటనే నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. ఏమైంది అంటూ ఆరా తీశారు. సోషల్ మీడియాలో ఆయన గురించి వెతకడం మొదలు పెట్టారు. అయితే బాలకృష్ణకు జరిగింది చిన్న సర్జరీ అని తెలిసిన తర్వాత వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 31న కేర్ హాస్పిటల్( Care hospital )లో అడ్మిట్ అయిన బాలకృష్ణ.. రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సీనియర్ డాక్టర్ల బృందం ఆయనకు నాలుగు గంటల పాటు శ్రమించి షోల్డర్ సర్జరీ చేశారు. గత ఆరు నెలలుగా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నారు. అయితే బిజీగా ఉండడంతో సర్జరీ కోసం టైం ఇవ్వలేకపోయారు.
బోయపాటి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న అఖండ ( Akhanda ) సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం.. అలాగే ఆహ ( Aha )లో ఒప్పుకున్న Unstoppable టాక్ షో 5 ఎపిసోడ్లు షూట్ చేయడంతో కొన్ని రోజులు విశ్రాంతి దొరికింది. దాంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు బాలకృష్ణ. ఆయన్ను ట్రీట్ చేసిన వైద్యులు కూడా బాలయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని.. షూటింగ్స్‌కు దూరంగా ఉండాలని వాళ్లు సూచించారు. 6 వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత బాలయ్య మళ్లీ షూటింగ్‌కు రావచ్చు. అంటే డిసెంబర్లో గోపీచంద్ మలినేని ( Gopichand malineni ) సినిమా మొదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గోపీచంద్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు బాలకృష్ణ. వేటపాలెం ( vetapalem ) నేపథ్యంలో గోపీచంద్ ఈ కథ రాసుకున్నాడు. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది మేలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏదేమైనా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాతే షూటింగ్ కు రావాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nandamuri Balakrishna | కేర్ ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణ
Akhanda New release date | అఖండకు కొత్త విడుదల తేదీ ఫిక్స్..పోటీ లేనట్టేనా..!
Unstoppable | ఆహా షో కోసం బాలయ్య అబ్బా అనిపించే రెమ్యునరేషన్..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
Nandamuri balakrishna | బాలయ్యను చూసి భయపడుతున్న ఆ హీరోయిన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

