e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News సిల్క్ స్మిత‌ను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సిల్క్ స్మిత‌ను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ముప్పై ఏండ్ల కింద‌ తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఐటమ్ క్వీన్ అంటే సిల్క్ స్మిత మాత్రమే. కేవలం 16 ఏళ్ల కెరీర్‌లోనే ఏకంగా 450 సినిమాలకు పైగా నటించిన సిల్క్ స్మిత.. 36 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. తెలుగు నుంచి హిందీ వరకు అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించింది. స్టార్ హీరోలందరితోనూ నటించింది. కేవలం డాన్సర్ గానే కాకుండా నటిగా కూడా సిల్క్ స్మిత మంచి గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఆదిత్య 369.అందులో రాజనర్తకి పాత్రలో నటించింది సిల్క్ స్మిత. తమ కాలానికి వచ్చిన బాలకృష్ణపై మోజుపడి కృష్ణ దేవరాయల దగ్గర దోషిగా నిలిచిపోయే పాత్ర ఇది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ మధ్య 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆదిత్య 369 విశేషాలను బాలకృష్ణ మీడియాకు తెలిపారు. సినిమా విజయంలో సిల్క్‌స్మిత‌ పాత్ర కూడా కీలకమైందని చెప్పాడు బాలయ్య. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన గురించి పంచుకున్నాడు.

సిల్క్ స్మితకు తెలుగు రాదు. దాంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్‌ను ఇంగ్లీష్‌లో చెప్పింది. చెప్పడమే కాకుండా షాట్ అయిపోయిన తర్వాత ఓకే కదా డైరెక్టర్ గారూ అని అడిగింది. దాంతో అక్కడే ఉన్న సింగీతం.. నువ్వు డైలాగ్ చెప్పింది ఇంగ్లీషులో అమ్మ.. మనది తెలుగు సినిమా అనేశాడు. దాంతో సెట్ లో ఉన్న వాళ్ళందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వేశారు. అంటూ నాటి స‌ర‌దా సంఘటనను గుర్తు చేసుకున్నాడు బాలకృష్ణ. అయితే జోక్స్ ఎలా ఉన్నా స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం సిల్క్ స్మితని కొట్టే ఆడది మరొకరు లేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. సాక్షాత్తు శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా సిల్క్ స్మితను ఫాలో అయ్యారని.. అది ఆమె రేంజ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

- Advertisement -

ఎనభైల్లో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ లేకపోతే అది సినిమా కాదు. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చివరికి ఏమీ లేకుండా చనిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కటిక పేదరికం అనుభవిస్తూ.. అప్పుల ఊబిలో చిక్కుకొని.. దిక్కుతోచని స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ప‌వ‌న్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో

RRR ప్ర‌మోష‌న్స్ | ఐదు భాష‌ల్లో దోస్తీ సాంగ్‌.. ఒక్కో భాష‌లో ఒక్కో సింగర్‌

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

బుచ్చిబాబు మ‌ళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana