తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
వరుణ్ సందేశ్..హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. ఈ రెండు సినిమాలు వరుణ్ సందేశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు వరుణ్ సందేశ్. ఈ రెండు సినిమాలు వరుణ్ సందేశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా..అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. వరుణ్ సందేశ్ కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని చాలా మంది అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ షోతో ఫేంలోకి వచ్చి..అందరినీ అలర్ట్ చేశాడు.
అయితే ఉదయ్‌కిరణ్, తరుణ్ లాంటి హీరోలు కెరీర్ కొత్తలో మంచి ఫేం సంపాదించి..ఆ తర్వాత ఆఫర్లకు దూరమయ్యారు. వీరితో తనను పోల్చడంపై వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ…నాకు ఉదయ్‌కిరణ్ చాలా బాగా తెలుసు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందోనని చాలా బాధపడ్డా. తరుణ్ కూడా నాకు తెలుసు. నా చేతుల్లో నుంచి కోల్పోయినదాన్ని తెచ్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. బిగ్ బాస్ తర్వాత కొన్ని కథలకు సైన్ చేశా. కోవిడ్, ఇతర కారణాల వల్ల ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తర్వాత నేను యూఎస్ కు వెళ్లి ఐటీ కోర్సు చేశాను. ఏదో వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉందని వరుణ్ అన్నాడు.
వరుణ్ సందేశ్ సినిమాలతో బిజీగా కాకున్నా.. ఎప్పుడూ తన అభిరుచికి అనుగుణంగా ఏదో ఒకటి చేస్తున్నాడు. లైఫ్ లో ఏదో ఎందుకు జరగడం లేదని ఆలోచించకపోవడం, కెరీర్ విషయంలో చాలా స్పోర్టివ్‌గా, ఎనర్జిటిక్ గా ఉండటం నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఒడిశాలోని రాయగడలోని జన్మించిన వరుణ్ సందేశ్ హైదరాబాద్‌లో నాలుగేళ్లున్నాడు. ఆ తర్వాత అతడి ఫ్యామిలీ వరుణ్ సందేశ్ చదువుకున్న న్యూజెర్సీలోని బ్రిడ్జివాటర్ టౌన్ షిప్ కు వెళ్లిపోయింది. వరుణ్ సందేశ్ ప్రముఖ తెలుగు రైటర్ జీడిగుంట రామచంద్రమూర్తికి మనవడు. 2015లో నటి వితికా షేర్ ను వివాహం చేసుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు వరుణ్ సందేశ్.
ఇవి కూడా చదవండి..
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

