ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
టాలీవుడ్ నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియమణి-ముస్తఫారాజ్ ల వివాహం చెల్లదని ముస్తఫారాజ్ మొదటి భార్య అయేషా ఆరోపించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియమణి-ముస్తఫారాజ్ ల వివాహం చెల్లదని ముస్తఫారాజ్ మొదటి భార్య అయేషా ఆరోపించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ముస్తఫారాజ్, అయేషా 2013లో విడిపోయారు. ఆ తర్వాత ముస్తఫారాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడు. ముస్తఫారాజ్ ఇప్పటివరకు విడాకుల కోసం దరఖాస్తు పెట్టలేదని, తాను ఇప్పటికీ ముస్తఫారాజ్ భార్యనేనని అయేషా అంటోంది.
ముస్తఫారాజ్ తో నా వివాహ బంధం ఇప్పటికీ ఉంది. ముస్తఫారాజ్-ప్రియమణి పెళ్లి చెల్లదు. ప్రియమణిని పెళ్లి చేసుకున్నపుడు ముస్తఫా రాజ్ బ్రహ్మచారిని అని కోర్టులో చెప్పాడు. అయితే తాము మాత్రం ఇప్పటివరకు విడాకులకు దరఖాస్తు చేసుకోలేదని అయేషా ఆరోపిస్తోంది. అయేషాకు ఇద్దరు పిల్లలు.
అయేషా ఆరోపణలు అబద్దం:
కాగా ఆమె ఆరోపణలపై ముస్తఫారాజ్ స్పందిస్తూ..నాపై అయేషా చేస్తున్న ఆరోపణలు అబద్దం. నేను రెగ్యులర్ గా పిల్లల ఖర్చులను అయేషాకు అందజేస్తున్నా. ఆమె కేవలం నా నుంచి డబ్బు వసూలు చేయడానికి ఇలా ప్రయత్నిస్తుందన్నాడు. అయేషా, నేను 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నాం. ఆమెకు 2013లో విడాకులు ఇచ్చాను. 2017లో ప్రియమణితో నా పెళ్లి అయింది. మరి అయేషా ఇంతకాలం ఎందుకు టైం తీసుకుందని ముస్తఫారాజ్ ప్రశ్నించాడు. మరి అయేషా ఆరోపణలపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

