బుచ్చిబాబు మళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు బుచ్చి బాబు సాన. సుకుమార్ శిష్యుడుగా సినీ ప్రయాణం మొదలు పెట్టి ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు బుచ్చి బాబు సాన. సుకుమార్ శిష్యుడుగా సినీ ప్రయాణం మొదలు పెట్టి ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా కృతి శెట్టిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఉప్పెన సినిమా విడుదలై ఐదు నెలలు పైగా అయినా బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటి రాలేదు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తర్వాత సినిమా ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని…ఇందులో ఎన్టీఆర్ రూరల్ గెటప్ లో కనిపిస్తాడని టాక్ వచ్చింది.
అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజిగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్ తో కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాతే బుచ్చి బాబు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ తో వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు డేట్స్ దొరికే అవకాశమే లేదు కాబట్టి ఈ గ్యాప్ లో బుచ్చి బాబు తన మొదటి హీరో వైష్ణవ్ తో కలిసి మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తారని టాక్.
మొదటి సినిమా హిట్ అవడంతో వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపుతున్నాడు. వైష్ణవ్ హీరోగా క్రిష్ దర్వకత్వం వహించిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడికి వైష్ణవ్ డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ కాంబో లో సినిమాపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

