e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ సాధించిన వాళ్లు కొంద‌రైతే..స‌క్సెస్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారు మ‌రికొంద‌రు. సినిమా స‌క్సెస్‌, ఫెయిల్యూర్ కు సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరోలు కొంత‌మందే ఉంటారు. ఈ జాబితాలో టాప్ లో ఉంటాడు స‌త్య‌దేవ్‌. సైడ్ క్యారెక్ట‌ర్లతో కెరీర్ షురూ చేసి సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు స‌త్య‌దేవ్‌.

పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చి జ్యోతిల‌క్ష్మి సినిమా స‌త్య‌దేవ్ కు యాక్ట‌ర్ గా మంచి బ్రేక్ ఇచ్చింది. హార్డ్ వ‌ర్క్‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకుంటున్న స‌త్యేదేవ్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలను షేర్ చేసుకున్నాడు. తన చుట్టూ ఉండే వ్య‌క్తుల‌కు స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌డం త‌న‌కు ఎక్జ‌యిట్ అనిపించే విష‌య‌మంటున్నాడు స‌త్యదేవ్‌.

- Advertisement -

‘నేను న‌టిస్తున్నాన‌ని కేవ‌లం ముగ్గురు వ్య‌క్తుల‌కు మాత్ర‌మే తెలుసు. అది నా త‌ల్లిదండ్రులు, భార్య‌. నా స్నేహితుల‌కు కూడా నేను న‌టిస్తున్న‌ట్టు తెలియ‌దు. కొన్నేళ్ల క్రితం నేను జ్యోతిల‌క్ష్మి సినిమాలో న‌టిస్తున్న విష‌యం స్నేహితులెవ‌రికీ చెప్ప‌లేదు. జ్యోతిల‌క్ష్మి విడుద‌లైన త‌ర్వాత నా స్నేహితులు సినిమా చూసి ఒక్క‌సారి షాక‌య్యారు. పూరీ జ‌గ‌న్నాథ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా త‌మ‌కు ఆ విష‌యం ఎందుకు చెప్ప‌లేద‌ని న‌న్ను అడిగారు. ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు లాంటి హీరోలను చూడ‌టం, వారితో మాట్లాడ‌టం, న‌టించిన‌పుడు’ చాలా ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు స‌త్య‌దేవ్‌.

డార్లింగ్ లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫ్రెండ్‌గా మెరిశాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేశ్ బాబుతో క‌లిసి ఆర్మీ జ‌వాను అజ‌య్ గా క‌నిపించాడు.స‌త్యదేవ్ ప్ర‌స్తుతం తిమ్మ‌రుసు, గుర్తుందా సీతాకాలం, గాడ్సే స్కైలాబ్ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ లీడ్ రోల్ లో న‌టిస్తున్న రామ్ సేతులో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు స‌త్య‌దేవ్‌. ఈ చిత్రంతో బాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ఇవి కూడా చదవండి..

నిర్మాతగా అల్లు బాబీ..బ‌న్నీ హ్యాపీ మూమెంట్స్

నాగ‌శౌర్య మేనేజ‌ర్ గా వెంక‌ట్‌..అత‌నెవ‌రో తెలుసా..?

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

సినిమాల‌కు యువ హీరో గుడ్‌బై..?

ఇంటి పేరు తెచ్చిన తంటా..క‌ర‌ణ్ కుంద్రాకు చిక్కులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana