పేయింటర్ దారుణ హత్య
పేయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదులు తెలిపిన కథనం ప్రకారం గోరఖ్‌పూర్ నుంచి నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్‌లో అనిల్ కుమార్ (43) నివాసముంటున్నాడు.
జవహర్‌నగర్, మే 22: పేయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదులు తెలిపిన కథనం ప్రకారం గోరఖ్‌పూర్ నుంచి నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్‌లో అనిల్ కుమార్ (43) నివాసముంటున్నాడు. పేయింటింగ్ కాంట్రాక్టర్‌గా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అనిల్ కుమార్ నివసించే గదిలో నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… పరిశీలించగా కుళ్ళిన స్థితిలో మృతదేహం కనిపించింది. అనిల్‌కుమార్ స్నేహితులతో కలిసి మద్యం తాగిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని… ఆర్ధిక తగాదాలా లేక ఇతరత్రా కారణాలతో హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. ఇంటి యజమాని అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

