Rukmini Vasanth | ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా చాలా పద్ధతైన పాత్రల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మ, తాజాగా గ్రీన్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న విజువల్స్ నెటిజన్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ లీకైన ఫొటోలు, వీడియో క్లిప్స్‌లో ఆమె చుట్టూ కెమెరాలు, టెక్నీషియన్లు మరియు ప్రొడక్షన్ సెటప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇది ఏదైనా ప్రముఖ బ్రాండ్ ప్రమోషన్ లేదా ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం చేసిన అఫీషియల్ షూట్ అయ్యి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది ఏఐ డీప్‌ఫేక్ (AI Deepfake) అయ్యి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలపై ఇప్పటివరకు నటి రుక్మిణి వసంత్ కానీ, ఆమె టీమ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదా క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు రుక్మిణి వసంత్ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’, రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ చిత్రాలతో బిజీగా ఉంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సమయంలోనే ఈ బికినీ షూట్ వీడియోలు లీక్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్, శాండల్‌వుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Rukmini Vasanth first Bikini shoot video📷 #RukminiVasanth pic.twitter.com/bvsc5i5SiY
— Jayesoorya (@Jayesoorya) May 22, 2026