హిమాయత్‌నగర్, మే 22 : వృద్ధ తల్లిదండ్రులను వేధించిన కేసుల్లో ఓ వ్యక్తికి నాంపల్లిలోని 5వ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణగూడలో ని వాసం ఉండే జి.శ్రీనివాస్ (44) ప్రైవేట్ ఉద్యోగి. గత కొద్దిరోజుల నుం చి అకారణంగా అతని వృద్ధ తల్లిదండ్రులను మానసికంగా వేధింపులకు గురిచేయడంతో వారిపై దాడి చేస్తున్నాడు. శ్రీనివాస్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన తప్పు ను ఒప్పుకోవడంతో కోర్టులో ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ ఎం.భాస్కర్ నిందితుడు శ్రీనివాస్‌కు 60 రోజుల జైలు శిక్షతో పాటు రూ.50 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కేసును అడ్మిన్ ఎస్సై జె.శ్రీకాంత్‌రెడ్డి దర్యాప్తు చేసారు.