బూర్గంపహాడ్, జూలై 28 : మారుమూల ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల ఉన్నతే లక్ష్యమని బూర్గంపహాడ్ మండలం బత్తులనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం దూదాబాయి అన్నారు. మంగళవారం పాఠశాలలో టీం సంభవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, జామెంట్రీ బాక్సులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తూ భవిష్యత్‌కు బాటలు వేస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. విద్య, సామాజిక, సేవా కార్యక్రమాలను మారుమూల ప్రాంతాల్లో విస్తరించి పేద విద్యార్థులకు అండగా నిలుస్తామని ఫౌండేషన్ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణసాగర్ సర్పంచ్, ఉప సర్పంచులు తాటి వాణి, భూక్యా మోహన్, హెచ్ఎం సపావత్ బాలకృష్ణ చౌహాన్, ఎఫ్ఎల్ఎన్ జిల్లా మానిటరింగ్ మేనేజర్ అల్లూరిరెడ్డి, మండల రిసోర్స్ పర్సన్ జగన్, ఉపాధ్యాయులు భాస్కర్, శారద, అంగన్వాడీ టీచర్ జ్యోతి, రజిత, సమ్మయ్య, నరేశ్, రామకృష్ణ, మల్లేశ్వరి, రాము, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.