RRR ప్రమోషన్స్ | ఐదు భాషల్లో దోస్తీ సాంగ్.. ఒక్కో భాషలో ఒక్కో సింగర్
ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ పేరిట ఒక ప్రత్యేక పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. స్నేహం విలువను చాటిచెప్పే ఈ సాంగ్‌ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు.

బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచాన్నే టాలీవుడ్‌వైపు చూసేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా వస్తున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ ఒక్కటే కాదు.. ఇండియన్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ పాన్ ఇండియన్ మూవీని అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ పేరిట ఒక ప్రత్యేక పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.
స్నేహం విలువను చాటిచెప్పే ఈ సాంగ్‌ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్‌ను ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో పాడించాడు కీరవాణి. దీంతో ఆయా భాషల్లో ఈ పాటను పాడే సింగర్ ఎవరా అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ వివరాలను తెలియజేస్తూ ఒక ఫొటోను విడుదల చేసింది చిత్ర బృందం. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఈ పాటను ఆయా భాషల్లో ఆలపించారు.
The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊
— RRR Movie (@RRRMovie) July 27, 2021
An @mmkeeravaani Musical.🎵
🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం మేకింగ్ వీడియోను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. కొమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరీస్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
బుచ్చిబాబు మళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dosti song
- Keeravani
- Rajamouli
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

