Unstoppable | ఆహా షో కోసం బాలయ్య అబ్బా అనిపించే రెమ్యునరేషన్..

Balakrishna Unstoppable | బాలయ్య టాక్ షో చేయడం అనేది అద్భుతం.. అద్వితీయం.. అమోఘం అంటూ మురిసిపోతున్నారు అభిమానులు. ఎందుకంటే బాలయ్య గురించి తెలిసిన వాళ్లెవరైనా ఇదే అనుకుంటారు. టాక్ షోకు రావడానికే ఆలోచించే బాలయ్య.. ఎలా టాక్ షోకు హోస్ట్ అయ్యాడబ్బా అంటూ అంతా ఆరా తీస్తున్నారు.. మరోవైపు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా అల్లు అరవింద్ మాత్రం మామూలోడు కాదబ్బా.. బాలకృష్ణ ను యాంకరింగ్ చేయడానికి ఒప్పించడం ఏంటి సామీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది నిజంగా అరాచకమే.. బాలయ్య యాంకరింగ్ చూడ్డానికి మేం సిద్దం అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఆయన అన్‌స్టాపబుల్ షో. ఈ షో గురించి ఇలా చెప్పారో లేదో అప్పుడే ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూడటం మొదలు పెట్టారు.

నవంబర్ 4 నుంచి ఆహలో టెలికాస్ట్ కానుంది అన్‌స్టాపబుల్ షో. ఈ షో లాంచ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ నవ్వించారు కూడా. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్ ను ఆట పట్టించాడు కూడా. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్ ను బండోడు అనే వాడని గుర్తు చేసుకున్నారు. అల్లు కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నాడు బాలయ్య. ఈ సందర్భంగా అల్లు అరవింద్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గొప్ప మనిషి.. కేవలం సినిమాలోనే నటిస్తాడు.. బయట నటించడం రాదని చెప్పాడు. కోపం వచ్చినా సంతోషం వచ్చినా నటించకుండా రియల్ ఎమోషన్స్ చూపించే మనిషి అన్నాడు. అలాంటి వ్యక్తి హోస్ట్ గా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండని చెప్పాడు అల్లు అరవింద్.

ఇదిలా ఉంటే ఈ అన్‌స్టాపబుల్ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే సినిమా కంటే ఎక్కువగా దీనికే పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది. బాలయ్యతో యాంకరింగ్ అంటే మామూలు విషయం కాదు. దానికి భారీగానే ఖర్చు చేయాల్సిందే. అల్లు అరవింద్ అండ్ ఆహా టీం కూడా ఇదే చేశారు. ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 40 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. 12 ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ ముగుస్తుందని ప్రచారం జరుగుతుంది. అంటే ఈ లెక్కన దాదాపు 6 కోట్ల వరకు అందుకుంటున్నాడు బాలయ్య. మరి ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Balakrishna : ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ లాంచిగ్ ఫొటోలు
Balakrishna | బాలకృష్ణపై పవన్ కల్యాణ్ స్పీచ్ ఎఫెక్ట్..!
Bala Krishna: మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ అన్నదమ్ములే… బాలకృష్ణ కామెంట్స్
Mokshagna | మోక్షజ్ఞ బర్త్ డే స్పెషల్..వారసుడు ఎప్పుడొస్తున్నాడంటే..?
Shruthi Haasan | బాలకృష్ణ మూవీ..సింపుల్‌గా తప్పించుకున్న శృతిహాసన్
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

