టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శీను (Boyapati Srinu) కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు అఖండ (Akhanda). ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తవగా..పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే పలు రకాల వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కొత్త విడుదల తేదీ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం అఖండ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్సయినట్టు తెలుస్తోంది.
అంతేకాదు వచ్చే వారమే విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని లేటెస్ట్ టాక్. త్వరలోనే బాలకృష్ణ అండ్ టీం అఖండ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టనున్నారట. డిసెంబర్ 2 డేట్ ఫైనల్ అయితే బాలకృష్ణ సినిమాకు బాక్సాపీస్ వద్ద పెద్ద పోటీ ఏమి ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అఖండ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్లు జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!