బాలయ్యను చూసి భయపడుతున్న ఆ హీరోయిన్..!
నందమూరి బాలకృష్ణను చూస్తే ఎవరికైనా ఒక్క క్షణం భయం పుడుతుంది. ఎందుకంటే ఆ కటౌట్ అలా ఉంటుంది మరి. ఆయన్ని చూసినపుడు కచ్చితంగా భయపడుతుంటారు.

నందమూరి బాలకృష్ణను చూస్తే ఎవరికైనా ఒక్క క్షణం భయం పుడుతుంది. ఎందుకంటే ఆ కటౌట్ అలా ఉంటుంది మరి. ఆయన్ని చూసినపుడు కచ్చితంగా భయపడుతుంటారు. అయితే దగ్గరికి వెళ్లి.. బాలయ్య ఏంటో తెలిసిన తర్వాత ఆయనతో ప్రేమలో పడిపోతారు. మా బాలయ్య చాలా స్వీట్ అంటూ అభిమానులు కూడా నెత్తిన పెట్టుకుంటారు. ఆయన కూడా పైకి కోపం ప్రదర్శించినా కూడా లోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటాడు. అందుకే బాలయ్య గురించి బాగా తెలిసిన వాళ్లు ఆయన్ని చిన్న పిల్లాడు అంటుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ హీరోయిన్ బాలయ్యను చూసి భయపడింది. ఇంకా చెప్పాలంటే చూడకుండానే భయపడిపోయింది.
బాలకృష్ణతో సినిమాకు ఒప్పుకుంది కానీ షూటింగ్ కు వచ్చే ముందు వరకు కూడా వణికిపోయింది. ఆయనెలా ఉంటాడో.. ఏం అంటాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో అంటూ మనసులో చాలా భయాలను పెట్టుకుని లొకేషన్ కు వచ్చింది ఆ ముద్దుగుమ్మ. కానీ వచ్చిన తర్వాత బాలయ్యను చూసి.. ఆయన కూల్ నేచర్ చూసి ఫిదా అయిపోయింది. ఆమె ఎవరో కాదు.. పూర్ణ. ఢీ షోలో జడ్జిగా ఉన్న ఈమె.. ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమాలో నటిస్తుంది. అందులో నెగిటివ్ కారెక్టర్ చేస్తుంది పూర్ణ. బాలయ్యతో నటించే అవకాశం వచ్చినపుడు ముందు పండగ చేసుకున్నా కూడా ఆ తర్వాత మాత్రం భయపడింది.
ఇదే విషయం దర్శకుడు బోయపాటి శీనుకు కూడా చెప్పింది పూర్ణ. కానీ ఒక్కసారి బాలయ్యను నేరుగా కలిసిన తర్వాత తాను ఎంత తప్పుగా ఆయన్ని అర్థం చేసుకున్నాననేది తెలిపింది పూర్ణ. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత బాలయ్య ఎంత మంచివాడు..ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాడు అనేది తనకు అర్థమైందని చెప్పుకొచ్చింది పూర్ణ. ఆయనతో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే అంటుంది. ఒక్కసారి బాలయ్యతో నటించిన తర్వాత ఆయనేంటో పూర్తిగా అర్థమవుతుందని చెప్పుకొచ్చింది పూర్ణ.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి కథ చెప్తే..పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..?
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

