సినిమాలు తీయడంలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ది ప్రత్యేక శైలి. ఫిల్మ్ మేకర్ గా ఎంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ గా ఉంటాడో కూతురు ఆలియా కశ్యప్ పట్ల అంతే ప్రోగ్రెసివ్ తండ్రిగా ఉంటాడు. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా ఆలియా కశ్యప్ యూట్యూబ్ ఛానెల్లో స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఆలియా తన తండ్రి అనురాగ్‌ను ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపించే ప్రశ్నలు వేసింది. పెళ్లికి ముందే శృంగారం, టీనేజ్‌లో ప్రెగ్నెన్సీతో పాటు మరిన్ని ప్రశ్నలు వేసింది. తండ్రీ కూతుళ్లు అనురాగ్, ఆలియా డిస్కషన్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఆలియా ఏడాదికాలంగా బాయ్‌ఫ్రెండ్ షేన్ గ్రెగోయిర్ తో కలిసి ఉంటుంది. అయితే షేన్ గ్రెగోయిర్ ను ఇష్టపడుతున్నారా అని అనురాగ్‌ను ప్రశ్నించగా..గ్రెగోయిర్ చాలా మంచి వాడు..పరిణతి కలిగిన వ్యక్తి. బాయ్‌ఫ్రెండ్స్ ఎంపికలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావని నాకర్థమైంది..అని అనురాగ్ రిప్లై ఇచ్చాడు.
పెళ్లికి ముందే శృంగారం, గర్భం దాల్చడం లాంటి విషయాలపై అనురాగ్ మాట్లాడుతూ..గతంలో సెక్స్ అనే పదం పలకడాన్ని నేరంగా భావించేవారు. కానీ ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం సెక్స్ గురించి సీక్రెట్‌గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శృంగారం అనేది మన శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్. కానీ దాని వల్ల తలెత్తే మంచి, చెడు ఏంటో నీకు వివరించిన తర్వాత నిర్ణయాన్ని నీకే వదిలేస్తానంటూ బదులిచ్చాడు.
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అని చెప్తే..ముందు నీవు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకుంటా. నీ నిర్ణయాన్ని గౌరవించి..నీకు మద్దతుగా నిలుస్తా. కానీ దానికి సంబంధించిన మూల్యాన్ని నీవే భరించాల్సి ఉంటుంది..అని చెప్పుకొచ్చాడు.
అమ్మాయిలు రాత్రిపూట బాయ్‌ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లడంపై స్పందిస్తూ..ఇది ఒకే..కానీ భారతీయ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తారు. కానీ వాళ్లు గుర్తించాల్సింది ఏంటంటే. అప్పటి, ఇప్పటి పరిస్థితులు మారాయి. ఇప్పటి పిల్లలు అణచివేతను ఇష్టపడరు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కాబట్టి మన భయాల్ని, అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం ఆపేయాలని సూచించాడు అనురాగ్ కశ్యప్.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com