రాజమౌళి కథ చెప్తే..పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..?
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎప్పుడెప్పుడు కథ చెబుతాడా అని చాలామంది స్టార్ హీరోలు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు.

తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎప్పుడెప్పుడు కథ చెబుతాడా అని చాలామంది స్టార్ హీరోలు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు. అందుకే ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు హీరోలు. అలాంటిది పవన్ కల్యాణ్ మాత్రం రాజమౌళి ఒక కథ చెబితే తర్వాత చూద్దాం అని అన్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే అది ఇప్పుడు జరగలేదు..దాదాపు 15 ఏళ్ల కిందట జరిగింది. కెరీర్ మొదట్లో సింహాద్రి సినిమా కథను ముందు బాలయ్యతో చేయాలనుకున్నాడు రాజమౌళి.
అయితే ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాకు బాలయ్య అసలు కనెక్ట్ అవ్వలేదు. ఈ విషయం స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. మరోవైపు విక్రమార్కుడు సినిమా కథ కూడా రవితేజ కోసం రాసుకోలేదు. ఇంత పవర్ ఫుల్ కథ ఒక స్టార్ హీరో చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టొచ్చు అనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ కు ఈ కథ చెప్పాలని చూశారు. అనుకున్నదే తరువాయి బంగారం సినిమా షూటింగ్ సమయంలో సెట్ కి వెళ్లి పవన్ కు ఈ కథ చెప్పాడు విజయేంద్రప్రసాద్.
తోడుగా రాజమౌళి కూడా ఉన్నాడు. కథ విన్న తర్వాత బాగానే ఉంది కానీ తర్వాత చూద్దాం.. కాస్త గ్యాప్ తీసుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జూన్ 23న విక్రమార్కుడు సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్టోరీ బయటికి వచ్చింది. అంటే ఒక వేళ ఆ రోజు పవన్ కల్యాణ్ ఒప్పుకుని ఉంటే రాజమౌళితో సినిమా చేసి ఇప్పటికే 15 ఏళ్లు అయ్యి ఉండేది. అయినా పవన్ కల్యాణ్ ఈ ఒక్క సినిమానే కాదు..ఇంకా చాలా వదిలేశాడు.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

