సుబేదారి, జూలై14 : వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య పీడిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు.. వంద ల సంఖ్యలో బైక్‌లు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రధా న రహదారుల్లో అర కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్, ఏ మాత్రం అజాగ్రత్తగా వాహ నం నడిపినా ప్రాణాలు పోయే పరిస్థితి. ట్రైసిటీలోని వ రంగల్ బస్‌స్టేషన్ నుంచి హనుమకొండ, కాజీపేట జం క్షన్, మడికొండ ప్రధాన రహదారి, హంటర్‌రోడ్డు-అండర్ బ్రిడ్జి, ఖమ్మం రోడ్డు, పోలీసు కమిషనరేట్ నుంచి భీమారం, ఫాతిమా జంక్షన్ నుంచి కేయూసీ వంద ఫీట్ల రోడ్డు, పెద్దమ్మగడ్డ రూట్లలో రోజురోజుకూ ట్రాఫిక్ స మస్య ఎక్కువవుతోంది. వరంగల్ నగరం విస్తరించ డం, జనాభా అధికమవడం, వరంగల్, కాజీపేట రైల్వే జంక్షన్లు, బస్స్టేషన్లు, విద్య, వ్యాపార సంస్థలు, ఇక్కడి నుంచే వివిధ జిల్లాలకు ప్రభుత్వ ఉద్యోగులు రాకపోక లు సాగించడంతో రద్దీ పెరిగిపోయింది. నగరం చుట్టుపక్కల 35 నుంచి 45 కిలోమీటర్ల దూరం వరకు రోజు కు సగటున 1.5లక్షల వాహనాలు నడుస్తుంటాయి.
ఇష్టానుసారంగా పార్కింగ్..
నగరంలోని ప్రధాన రహదారుల వెంట బైక్‌లు,కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టానుసా రంగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఆయా రూట్లలో పలువురు ప్రమాదాల బారిన పడి మృతిచెందిన ఘటనలు అనేకం. ఇక షాపింగ్ కాంప్లెక్స్, వైన్స్,బార్ షాప్‌ల ఎదుట అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు కన్నెతి చూడడం లేదు. ఆ షాప్‌ల యజమానులు ఇచ్చే మామూళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రధాన జంక్షన్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ల మీద పెట్టిన ఫోకస్, ట్రాఫిక్ క్లియరెన్స్‌పై పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాహనాలను క్రమపద్ధతిలో పంపించాల్సి ఉండగా, పక్కకు వచ్చి సెల్ఫోన్లలో మునిగిపోవడంతో కొందరు రూట్లు, సిగ్నల్స్ అతిక్రమించి వెళ్ల్లడం, ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన సమస్య వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయకపోవడం. పోలీసు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఉన్నతాధికారులు దీనిపై సమాలోచనలు చేసినా కార్యరూరం దాల్చలేదు.

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లేదా?
నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లేదా?, ఎప్పుడు ఈ బాధను భరించాల్సిందేనా? అనే ప్రశ్నలు వాహనదారులు, నగర ప్రజలను వెంటాడుతున్నాయి. అదివారం మినహా పనిదినాల్లో రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి ఎంత తొందరగా బయలు దేరినా కూడా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ పనుల మీద వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనిచేయని సిగ్నల్స్
నగరంలో 15 ప్రధాన జంక్షన్లు ఉండగా, మెయింటనెన్స్ లేకపోవడంతో కొన్ని చోట్ల సిగల్స్ పనిచేయడం లేదు. టెక్నికల్ సమస్య వచ్చినపుడు వెంటనే స్పందించకపోవడంతో అవి పని చేయడం లేదని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తామని, సిగ్నల్స్ మెయింటనెన్స్ అంతా మున్సిపల్ కార్పొరేషన్ చూడాలని, తమకు సంబంధం లేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక సిగ్నల్స్ పాయింట్లు లేని ప్రాంతాలు నగరంలో 40కిపైగా ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీకి లేట్‌గా రావడం, సెల్ఫోన్లు చూడడం పైనే దృష్టి పెట్టడంతో వాహనాల క్లియరెన్స్ సరిగా జరగడం లేదు.
