టొరంటొ (కెనడా): యూఎస్ ఓపెన్‌కు ముందు వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకాకు ఊహించని షాక్ తగిలింది. ఆ టోర్నీకి సన్నాహకంగా జరుగుతున్న కెనడా ఓపెన్‌లో ఈ బెలారస్ బామ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంకా.. 6-7 (3/7) , 6-4, 4-6తో రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకటెరిన అలగ్జాండ్రోవా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్ టైబ్రేక్‌లో ఓడిన సబలెంకా తర్వాత పుంజకుని రెండో సెట్‌ను సొంతం చేసుకున్నా విజేతను నిర్ణయించేందుకు జరిగిన మూడో సెట్లో మాత్రం ప్రత్యర్థి దూకుడుకు తలవంచింది. కాగా అలగ్జాండ్రోవాకు వరల్డ్ నెంబర్ 1పై ఇది ఐదో విజయం కాగా డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో క్వార్టర్స్ చేరడం ఇదే మొదటిసారి. సబలెంకాతో పాటు అమెరికాకు చెందిన జెస్సికా పెగులా సైతం 3-6, 3-6తో డయానా ష్నైడర్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.