యుజీన్ (యూఎస్ఏ): వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు పతకాలు సాధించి సత్తాచాటారు. హైజంప్‌లో బసంత్ కుమార్ మేఘవాల్, లాంగ్‌జంప్‌లో షానవాజ్ ఖాన్ పతకాలు గెలిచారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన హైజంప్ ఫైనల్లో బసంత్.. 2.21 మీటర్లు దూకి రజతం నెగ్గాడు. తద్వారా అతడు ఈ టోర్నీలో తలపడుతూ హైజంప్ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. స్వర్ణం గెలిచిన అల్జీరియాకు చెందిన అయాచితో పాటు మూడో స్థానంతో కాంస్యం సాధించిన ఒటిస్ (బ్రిటన్) కూడా 2.21 మీటర్లే దూకినా తొలి ప్రయత్నంలోనే ఈ హైట్‌ను క్లీయర్ చేసిన అయాచికి పసిడి దక్కింది. బసంత్ తొలిసారి ఫౌల్ కాగా రెండో ప్రయత్నంలో దూకాడు. ఇక లాంగ్‌జంప్‌లో 18 ఏండ్ల షానవాజ్.. 7.84 మీటర్లు దూరం దూకి కాంస్యం గెలుచుకున్నాడు. డేనియల్ ఇంజొలి (ఇటలీ- 7.97 మీ.) గోల్డ్ కొట్టగా మేసన్ మెక్గార్డర్ (ఆస్ట్రేలియా 7.96 మీ.) సిల్వర్ గెలిచాడు. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన జితిన్ అర్జునన్ (7.59 మీ.) ఆరోస్థానంతో సరిపెట్టుకున్నాడు. కాగా బసంత్తో పాటు షానవాజ్ ఇద్దరూ భారత నేవీలోనే పనిచేస్తున్నారు. లాంగ్‌జంప్‌లోనూ షానవాజ్ ఈ టోర్నీలో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.