Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..

Suriya | దక్షిణాది ఇండస్ట్రీలో హీరో సూర్యకు ఉన్న మార్కెట్ గాని.. గుర్తింపు కానీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రెండు భాషల్లో కలిపి ఆయన సినిమాలు దాదాపు రూ.70 కోట్ల మార్కెట్ ఉంది. అలాంటి హీరో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే ఈ నిర్ణయాలను తమిళనాడు థియేటర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సూర్య చేసే పనులతో థియేటర్ల వ్యవస్థ నాశనమైపోతుందంటూ కోపంతో ఊగిపోతుంది తమిళనాడు థియేటర్స్ యూనియన్.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో తన బ్యానర్లో వచ్చిన పొన్మగల్ వంధాల్ చిత్రాన్ని సూర్య అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో నేరుగా రిలీజ్ చేశాడు. ఇందులో సూర్య భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మొదటి సినిమా ఇదే. దీంతో అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే.. సూర్య సినిమాలను థియేటర్లో విడుదల కానివ్వమని తీర్మానం చేశారు. కానీ సూర్య మాత్రం తన మనసు మార్చుకోలేదు. తాను హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోస్లోనే రిలీజ్ చేశాడు సూర్య. తనకు ఉన్న కోట్లాది రూపాయల అప్పులను బయట వాళ్లు వచ్చి తీర్చరు కదా.. అందుకే తన సినిమాలను ఎక్కడైనా విడుదల చేసుకుంటానని అప్పట్లో సూర్య చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన నాలుగు సినిమాలను వరుసగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌కు అమ్మేశాడు.
తాను నటించిన జైభీమ్ సినిమాతో పాటు రామే ఆండాలుమ్ రావనే ఆండాలుమ్, ఉదంపిరప్పే, ఓ మై డాగ్ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదల చేయగా.. ఇప్పుడు జై భీమ్ సినిమా వంతు వచ్చింది. నవంబర్ 2 నుంచి జై భీమ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే థియేటర్ల యాజమాన్యం మాత్రం సూర్యపై నిప్పులు కక్కుతున్నారు. ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా ఒకేసారి నాలుగు సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం ఒక సంచనలనం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim : ఆడాళ్లపై పోలీస్ దాడులు.. ఆసక్తికరంగా జై భీమ్ టీజర్
Suriya : ఆకాశం నీ హద్దురా కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందా..!
Jyothika : జ్యోతిక అందించిన ధైర్యం.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన తొమ్మిదేళ్ల బాధితురాలు
Samantha | సమంత చేసిన పనికి అంతా షాక్.. గే పెళ్లికి సపోర్ట్..
రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ-2019 విన్నర్, రన్నర్ దుర్మరణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

