రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ-2019 విన్నర్, రన్నర్ దుర్మరణం

Miss kerala 2019 death | సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. ఎంతో భవిష్యత్తు కళ్ల ముందు ఉండగా.. కోటి కలలతో కెరీర్ మొదలు పెడుతున్న ఇద్దరమ్మాయిలు దారుణంగా మృత్యువాత పడ్డారు. కారు ప్రమాదంలో మిస్ కేరళ -2019 ( Miss Kerala 2019 ) విన్నర్ అన్సీ కబీర్ ( Ancy Kabeer ), రన్నరప్ అంజనా షాబాన్ ( Anjana Shajan ) ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కేరళలో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు పలువుర్ని కంటతడి పెట్టిస్తుంది.

మిస్ కేరళ విన్నర్ అన్సీ కబీర్, రన్నర్ అంజనా షాబాన్ ఇద్దరూ మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి జాలీ ట్రిప్ వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఎర్నాకుళం బైపాస్ వద్ద ఒక బైక్‌ను తప్పించబోయి వాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. దీంతో అన్సీ, అంజనా ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరిలో ఒక యువకుడికి స్వల్ప గాయాలు కాగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరిగే కొన్ని గంటల ముందు అన్సీ కబీర్ తన ఇన్‌స్టాలో ఇట్స్ టైమ్ టూ గో అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే ప్రమాదానికి గురై మరణించింది. అయ్యో పాపం చనిపోయే విషయం ముందుగానే తెలిసిపోయినట్లు వెళ్లడానికి టైమ్ అయింది అంటూ రాసుకొచ్చిందేంటబ్బా అంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
2019వ సంవత్సరంలో జరిగిన అందాల పోటీలో తిరువనంతపురం అట్టింగల్‌లోని అలంకోడ్ కు చెందిన అన్సీ కబీర్ విజేతగా నిలిచింది. త్రిసూర్‌కు చెందిన అంజనా షాజన్ రన్నరప్‌గా నిలిచింది. సాధారణంగా అందాల పోటీలో గెలిచిన అమ్మాయి అంటే పోటీలో పాల్గొన్న మిగిలిన అమ్మాయిలకు పడదు. కానీ ఆ అందాల పోటీలో అన్సీ, అంజనా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అప్పట్నుంచి ఇద్దరూ కలిసి పలు ట్రిప్‌లు కూడా ఎంజాయి చేశారు. ఇప్పుడు కూడా అలాగే జాలీ ట్రిప్ నకు వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఎర్నాకుళం మెడికల్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పునీత్ మరణ వార్త చదువుతూ.. లైవ్‌లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్
Puneet Raj Kumar: పునీత్ నుదుటిపై ముద్దు పెట్టిన సీఎం బొమ్మై
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

