పునీత్ మరణ వార్త చదువుతూ.. లైవ్‌లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్

news reader cries uncontrollably while reporting puneeth rajkumar death | పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంటే మొన్నటివరకు ఒక కన్నడ నటుడు అని మాత్రమే మనకు తెలుసు. కానీ కర్ణాటకలో ఆయన ఒక బ్రాండ్.. యూత్ ఐకాన్.. ఒక ఎమోషన్.. అని ఆయన మరణం తర్వాతనే అందరికీ తెలిసింది. పునీత్ అకాల మరణం చెందాడని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్న ఫ్యాన్స్‌ను చూస్తే అర్థమైంది వాళ్ల గుండెల్లో ఆయన స్థానమేంటో ! ఫ్యాన్స్ మాత్రమే కాదు మన తెలుగు హీరోలు కూడా పునీత్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అర్థమవుతుంది ఆయన అంటే ఏంటో !! అలాంటి గొప్ప వ్యక్తి మరణ వార్తను చెప్పాలంటే దుఃఖం ఎలా ఆగుతుంది. అందుకే ఓ న్యూస్ రీడర్.. పునీత్ మరణవార్త చదువుతున్న సమయంలో గుండెల నుంచి ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది.
శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ క్రమంలో ఆయన మరణవార్త చదువుతున్న ఓ న్యూస్ రీడర్ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదివేటప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టింది. కొద్దిసేపటికి కెమెరామ్యాన్, సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ మిగిలిన వార్తను చదివింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneet Raj Kumar: పునీత్ నుదుటిపై ముద్దు పెట్టిన సీఎం బొమ్మై
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

