రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసిన సేవల గురించి తెలుసా

Puneeth rajkumar | తెలుగు ప్రేక్షకులకు నిన్న మొన్నటి వరకు పునీత్ రాజ్ కుమార్ అనే ఒక కన్నడ హీరో ఉన్నాడు అని మాత్రమే తెలుసు. ఆయన గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. కన్నడ కంఠీరవ, లెజండరీ నటుడు రాజ్ కుమార్ కొడుకుగా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం పునీత్. కానీ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెలుగులో పెద్దగా ఏమీ లేదు. అయితే కన్నడలో మాత్రం పునీత్ రాజ్ కుమార్ రేంజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ మన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో.. అంతకు మించి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కు ఉంది.

పునీత్ రాజ్‌కుమార్‌కు కేవలం సినిమాల నుంచి మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదు ఇది. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉండేవి. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు పునీత్. ఆయన చేసే సేవా కార్యక్రమాలే అతడిని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. మిగిలిన హీరోల కంటే ఎందుకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది అనే దానికి సమాధానం కూడా అతను చేసిన సేవా కార్యక్రమాలు అనే చెప్తుంటారు. కన్నడనాట అతను చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ రోజు ఆయన చనిపోయాడు అని తెలుసుకొని ఎంతో మంది అభిమానుల గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నారు. చిన్న వయసులో తమ హీరో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని కలలో కూడా ఊహించలేదని కన్నీరుమున్నీరు అవుతున్నారు..
45 ఉచిత స్కూల్స్ ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేయడంతో పాటు తన రెండు కళ్లను పునీత్ రాజ్‌కుమార్ దానం చేశాడు. అందుకే కన్నడ ప్రేక్షకులకు ఆయనంటే అంత అభిమానం. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఆ నిజమైన హీరో మరణ వార్త విని తల్లడిల్లిపోతున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

