Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Puneet Rajkumar | కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు.

బెంగుళూరు: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కానీ ఆ ప్రార్థనలేవీ నెరవేరలేదు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఉదయమే ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు.. ఆయన మరణించినట్లు తాజాగా ప్రకటించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఆసుపత్రికి వచ్చి పునీత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణవార్తను ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పునీత్ రాజ్ కుమార్ మరణం నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా హైఅలర్ట్ విధించారు. సినిమా హాళ్లు ఏవీ తెరవొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ తన టాలెంట్‌తో పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు. పునీత్ మంచి డ్యాన్సర్ కూడా కావడంతో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలారు. దీంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది. 46 ఏళ్ల కన్నడ పవర్ స్టార్ గుండెపోటుతో కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

