Puneeth Rajkumar Career | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ (Dr. Rajkumar) కుమారుడిగా శాండల్‌వుడ్ (Sandalwood)కు ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో పవర్ స్టార్‌గా ఎదిగాడు పునీత్ రాజ్ కుమార్.

కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ (Dr. Rajkumar) కుమారుడిగా శాండల్‌వుడ్ (Sandalwood)కు ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో పవర్ స్టార్‌గా ఎదిగాడు పునీత్ రాజ్ కుమార్. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకు్న పునీత్‌రాజ్‌కుమార్ హఠాన్మరణంతో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికిలోను చేసింది.
పునీత్‌రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) 17 మార్చి 1975లో చెన్నైలో రాజ్‌కుమార్, పార్వతమ్మ రాజ్‌కుమార్ దంపతులకు జన్మించాడు. వీరికి ఐదుగురు సంతానం కాగా..పునీత్ రాజ్‌కుమార్ అందరికంటే చిన్నవాడు (ఐదో సంతానం). పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ కూడా పాపులర్ యాక్టర్. పునీత్ రాజ్‌కుమార్ ను కన్నడ సినీ ప్రేక్షకులు అప్పు (Appu)అని పిలుచుకుంటారు. నటుడిగా, ప్లే బ్యాక్ సింగర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, నిర్మాతగా కన్నడ చిత్రాలు చేసిపవర్స్టార్గా పాపులారిటీ తెచ్చుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మంచి డ్యాన్సర్ కూడా.

బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి..
బాలనటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టాడు పునీత్ రాజ్‌కుమార్. వసంత గీత, భాగ్యవంత, చలిసువ మొదగలు, ఎరడు నక్షత్రగలు, భక్త ప్రహ్లాద, బెట్టడ హూవు చిత్రాల్లో నటించాడు. బెట్టడ హూవు చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చలిసువ మొదగలు చిత్రాని్ని కర్నాటక ప్రభుత్వం అందించే ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు అవార్డు అందుకున్నాడు.
2002లో అప్పు సినిమాతో హీరోగా మొదటిసారే కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో పునీత్ రాజ్‌కుమార్ ను అందరూ ముద్దుగా అప్పు పిలుచుకుంటారు. ఆ తర్వాత అభి, వీర కన్నడిగ, ఆకాశ్, అజయ్, అరసు, మిలానా, వంశి, రామ్, జాకీ హుడుగారు, రాజకుమార, అంజనీపుత్ర సినిమాలతో రికార్డుల మోత మోగించి..కన్నడ సినీపరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సెలబ్రిటీల్లో టాప్‌లో నిలిచాడు.

గేమ్ షోకు ప్రజెంటర్‌గా..
2012లో కన్నడ టీవీ గేమ్ షో కోట్యాధిపతి (Who Wants to Be a Millionaire?)తో టీవీ హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న జేమ్స్, ద్విత్వ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. నిర్మాతగా Family Pack, One Cut Two Cut An Flower is Came ప్రాజెక్టులు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

