Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో (Aryan Khan) అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో (Aryan Khan) అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అధికారులు అక్టోబర్ 3న ఆర్యన్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు షారుక్. అయితే ఆర్యన్‌కు బెయిల్ రాకపోవడంతో షారుక్ ముంబై కోర్టును ఆశ్రయించాడు.
ఇవాళ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగాల్సి ఉంది. ఇక ఆర్యన్‌ను ఎలాగైనా బయటకు తీసుకురావాలనుకుంటున్న షారుక్‌ఖాన్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి ఆ బాధ్యతను అప్పగించాడు. మరి షారుక్ సంప్రదించిన టాప్ లాయర్ ఆర్యన్‌కు ఈ సారైనా బెయిల్ మంజూరు చేయించి బయటకు తీసుకొస్తారా..? లేదా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో ఇప్పటికే ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ నటి అనన్యపాండే (Ananya Panday)కు కూడా సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు విచారణకు పిలిపించి అనన్యపాండేపై ప్రశ్నల వర్షం కురిపించారు. అక్టోబర్ 3న ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్ సహా పలువురు పట్టుబడిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

