aryan khan bail | ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు.. అరెస్టు నుంచి బెయిల్ దాకా ఏ రోజు ఏం జరిగింది?

aryan khan bail | బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో అరెస్టై 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్‌ను ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆర్యన్‌తో పాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అసలు ఆర్యన్‌ఖాన్‌ను ఎలా అరెస్టు చేశారు? అప్పటి నుంచి బెయిల్ వచ్చే వరకు ఏం జరిగిందనే విషయాలు ఒకసారి చూద్దాం..
ఆర్యన్ ఖాన్ కేసులో ఏం జరిగింది?

అక్టోబర్ 2
ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడిలో డ్రగ్స్‌తో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచాతో పాటు మరో ఐదుగురు పట్టుబడ్డారు.
అక్టోబర్ 3
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే వెల్లడించారు. అదే రోజు అరెస్టు చేసిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
అక్టోబర్ 4
ఆర్యన్ ఖాన్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్‌పై తొలిసారి వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎన్సీబీ దగ్గర ఆధారాలు లేవని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, నిందితులను అక్టోబర్ 11 వరకు తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని ఎన్సీబీ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 7 వరకు కస్టడీకి పంపించింది.
అక్టోబర్ 7
ఆర్యన్ ఖాన్‌తో పాటు ఈ కేసులోని నిందితులకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు.. 14 రోజుల జుడిషియల్ జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అక్టోబర్ 8
ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆర్యన్ ఖాన్‌ను ముంబైలోని ఆర్థర్ రోడ్డులో ఉన్న జైలుకు తరలించారు.
అక్టోబర్ 10
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా షారుక్ ఖాన్ డ్రైవర్ వాంగ్మూలాన్ని ఎన్సీబీ తీసుకుంది.
అక్టోబర్ 11
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13 వరకు న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో ఆర్యన్ మరో మూడు రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది.

అక్టోబర్ 14
ఇరుపక్షాల వాదనను విన్న న్యాయస్థానం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీంతో ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 20 వరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది.
అక్టోబర్ 20
ఆర్యన్ ఖాన్‌కు ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. నిందితుడు తరచూ డ్రగ్స్ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కనిపిస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. బెయిల్‌పై విడుదలైతే నిందితుడు ఇలాంటి మరో నేరం చేయలేరని చెప్పలేం కాబట్టి బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
అక్టోబర్ 21
డ్రగ్స్ పార్టీ విషయంలో అనన్య పాండేతో ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. షారుక్ ఖాన్ నివాసం మన్నత్ సహా అనన్య పాండే ఇండ్లపై ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అక్టోబర్ 26
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసులో ఆర్యన్‌ను కావాలనే ఇరికించి 20 రోజుల పాటు జైలులో ఉంచారని ఆయన తరఫు న్యాయవాది మాజీ ఏజీ ముకుల్ రోహత్గీ సతీశ్ మానేశిందే వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
అక్టోబర్ 27
ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా బెయిల్ పిటిషన్లపై బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఎన్సీబీ వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.
అక్టోబర్ 28
ఇరువర్గాల వాదనలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాకు బెయిల్ మంజూరు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bail to Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
డ్రగ్స్ ఇష్యూ ఆర్యన్ ఖాన్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించనుంది..?
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Samantha: చైతూ ఫోటోలని తొలగించిన సమంత
పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర హీరోయిన్గా పరిచయం అవుతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

