Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్

Venkatesh daughter ashritha interesting comments on samantha | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చేసే ప్రతి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా హాట్ టాపిక్‌గా మారుతుంది. సమంత చేసే ప్రతి పనిపై.. ఆమె పెట్టే ప్రతి పోస్టుపై ఒక కన్నేసి ఉంచారు అభిమానులు. నిన్నటికి నిన్న అమ్మాయిల పెళ్లి గురించి సమంత చేసిన పోస్ట్ వైరల్ అయింది. తమ కూతుళ్లకు ఎలా పెళ్లి చేయాలా అనే విషయం గురించి ఆలోచించడం మానేసి.. వాళ్ల జీవితం ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఒంటరిగా భయం లేకుండా ఎలా బతకాలి అనే విషయాల గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి అంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా ఒక పోస్ట్ చేసింది సమంత. ఇది చూసిన తర్వాత ఆమెకు పెళ్లి గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమైపోతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె పెట్టిన ఒక పోస్టుపై వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత స్పందించింది.
చైతూతో కలిసి ఉన్నప్పుడు వెంకీ కుటుంబంతో కూడా చాలా సరదాగా ఉండేది సమంత. రానాతో మాత్రమే కాకుండా వెంకటేశ్ కూతుళ్లతో కూడా మంచి రిలేషన్ మెయింటెయిన్ చేసింది సమంత. ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి బయటికి వచ్చిన తర్వాత వెంకటేశ్ కూతురు ఈమెపై కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు పెడుతుంది. తాజాగా ఈమె ఒక పెయింటింగ్ పోస్ట్ పెట్టింది. దీనికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల నుంచి కామెంట్స్ వచ్చాయి. మంచు లక్ష్మి, నందిని రెడ్డి లాంటి వాళ్లు కూడా సమంత పోస్టుపై కామెంట్ చేశారు. ఇక ఇదే పోస్టుపై వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత కూడా కామెంట్ చేసింది. ఇక నువ్వు స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకో అంటూ కామెంట్ చేసింది. బావకి విడాకులు ఇచ్చిన తర్వాత వెంకటేశ్ పెద్ద కూతురు బాగా హర్ట్ అయింది అని ఈ కామెంట్‌తో అర్థమవుతుంది. ఇక నీకు అడ్డు చెప్పే వాళ్లు ఎవరూ లేరు.. ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అర్థం ఈ కామెంట్లో ఉందని అంటున్నారు నెటిజన్లు. ఏదైనా సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురు రియాక్షన్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha: చైతూ ఫోటోలని తొలగించిన సమంత
సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
Samantha: నయన్‌కు బెస్ట్ విషెస్ అందించిన సామ్…ఎందుకో తెలుసా..!
Samantha: నాగచైతన్య కోసం సమంతఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
Venkatesh daughter ashritha interesting comments on samantha
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

