పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర హీరోయిన్గా పరిచయం అవుతుందా..?

Puri Jagannadh daughter pavithra puri | సినీ ఇండస్ట్రీలోకి వారసులు రావడం కొత్తేమీ కాదు. తెలుగుతో పాటు ఇప్పటికే అన్ని ఇండస్ట్రీల్లోనూ వారసులు ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. కేవలం వారసులు మాత్రమే కాదు.. వారసురాళ్లు కూడా ఈ మధ్య ఇండస్ట్రీకి వస్తున్నారు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ, రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక ఇండస్ట్రీలోనే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల, నాగబాబు కూతురు నిహారిక, రాధ కూతురు కార్తీక ఇలా చాలామంది వారసురాళ్లు తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో వారసురాలు ఇండస్ట్రీకి వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర.

చిన్నప్పుడే బుజ్జిగాడు సినిమాలో నటించింది పూరీ కూతురు పవిత్ర. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నటన జోలికి రాలేదు. ఇప్పుడు ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె అన్నయ్య, పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ స్పందించాడు. తన చెల్లి హీరోయిన్గా రావడం అబద్ధమని కొట్టిపారేశాడు. తనకు నటనపై ఆసక్తి లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. చిన్నప్పుడు కూడా కేవలం నాన్న బలవంతం మీదనే బుజ్జిగాడు సినిమా చేసిందని.. ఆ తర్వాత మళ్లీ నటన జోలికి రాలేదు అని చెప్పాడు ఆకాశ్. తన చెల్లి హీరోయిన్గా నటించకపోయినా కచ్చితంగా ఇండస్ట్రీలోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. తనకు సినిమా నిర్మాణం అంటే చాలా ఇష్టమని.. ప్రొడక్షన్లోకి వస్తుంది అంటూ చెప్పాడు ఆకాశ్ పూరీ. ప్రస్తుతం ఆకాశ్ రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే తన చెల్లెలు టాలీవుడ్ ఎంట్రీపై కన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆకాశ్ పూరీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే ఆర్.నారాయణమూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడు?
చిరంజీవికి పూరీ జగన్నాథ్ ఇప్పుడు గుర్తుకొచ్చాడా..?
Puri Jagannadh | పూరీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఛార్మి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

