చిరంజీవికి పూరీ జగన్నాథ్ ఇప్పుడు గుర్తుకొచ్చాడా..?

మెగాస్టార్ చిరంజీవి ( mega star chiranjeevi )తో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( puri jagannadh ) సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఈ కాంబినేషన్ కలిసినట్టే కలిసి చాలాసార్లు దూరం అయిపోయింది. నిజానికి చాలా సంవత్సరాల కిందట చిరంజీవికి ఒక కథ చెప్పాడు. అప్పట్లో ఆ సినిమా కథ నచ్చినా.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత 150వ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు అంటూ అప్పట్లో రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించాడు. దానికి ఆటో జానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ ఆటో జానీ సెకండాఫ్ కథ నచ్చకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్నాడు.
అప్పటి నుంచి చిరంజీవి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆయనతో సినిమా చేయడానికి సై అంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి పూరీ జగన్నాథ్ స్క్రిప్టులో సాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గాడ్ ఫాదర్ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ ఇది. గాడ్ ఫాదర్ సినిమా స్క్రిప్ట్ లో పూరి జగన్నాథ్ తనదైన మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఇంట్రడక్షన్‌తో పాటు మరికొన్ని సన్నివేశాల్లో కూడా మాస్ ఎలివేషన్స్ కోసం పూరీ సాయం తీసుకుంటున్నాడు దర్శకుడు మోహన్ రాజా.
చిరంజీవి కోరిక మేరకు పూరీ ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్‌లో హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది. పూరీ చేయి పడితే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలుసు కాబట్టే చిరంజీవి ఈయన సాయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కనీసం ఇలాగైనా చిరంజీవి పూరీ జగన్నాథ్ కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు. 2022 సమ్మర్ కానుకగా గాడ్ ఫాదర్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
నాగ చైతన్య, సమంత నుంచి ఫ్యాన్స్ కోరుకునే చివరి కోరిక ఇదే కావచ్చు..
samantha: సమంత- నాగ చైతన్య విడాకులపై సామ్ ఫాదర్ స్పందన ఇదే..!
Jeevitha Rajashekar : మంచి చేయాలనుకోవడం తప్పా?
మా ఎన్నికలలో ఓటు వేయనని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
విద్యుల్లేఖని విడాకులెప్పుడని అడుగుతున్న నెటిజన్స్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కమెడీయన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

