నాగ చైతన్య, సమంత నుంచి ఫ్యాన్స్ కోరుకునే చివరి కోరిక ఇదే కావచ్చు..

samantha naga chaitanya divorce | కలకాలం కలిసి ఉంటారు అనుకున్న అక్కినేని నాగ చైతన్య, సమంత పట్టుమని నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయకుండానే విడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు కూడా చాలా ఫీల్ అయ్యారు. అయితే కొందరు మాత్రం అభిప్రాయ భేదాలతో కలిసి ఉండే కంటే.. ఎవరి సొంత అభిప్రాయాలతో వాళ్లు దూరమైపోయి బతకడం బెటర్ అంటూ వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో సమంత, నాగ చైతన్య కూడా తమ ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని అటు మీడియాను ఇటు సన్నిహితులను కోరారు. ఎన్నో రోజుల అంతర్మథనం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. విడిపోవడం తమకు కూడా బాధ కలిగించే విషయమే అయినా కూడా తప్పలేదని ఇద్దరూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే వీళ్ల విడాకులపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చాలా మంది స్పందించారు. ఇందులో సమంత వైపు తప్పు ఉందని కొందరు.. లేదు నాగ చైతన్యదే తప్పు అని మరికొందరు అంటున్నారు. అయితే వాళ్లు విడిపోవడానికి అసలు కారణాలు కేవలం వాళ్లకు తప్ప మూడో మనిషికి తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇద్దరి నుంచి అభిమానులు కోరుకుంటున్నది మాత్రం ఒక్కటే. విడిపోయిన తర్వాత శత్రువుల్లా ఉండకుండా.. మిత్రుల్లా కలిసి ఉండాలి అంటున్నారు. వాళ్లు కూడా ఇదే చెప్పారు. విడాకులు తీసుకున్నంత మాత్రాన తమ ఇద్దరి మధ్య శత్రుత్వం లేదని.. పరస్పర అంగీకారంతోనే విడిపోవడానికి నిశ్చయించుకున్నామని చైతూ, సమంత ఇద్దరు చెప్పారు. అందుకే వ్యక్తిగత జీవితంలో విడిపోయినా సినిమాల్లో మాత్రం కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కథ నచ్చితే కచ్చితంగా ఇద్దరు కలిసి నటించండి అంటూ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఆన్ స్క్రీన్ చైతూ, సమంత చాలా బాగుంటారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు నాగ చైతన్య, సమంత. వీళ్లను అలాగే నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
samantha naga chaitanya divorce | విడిపోయినప్పటికీ ఆ విషయంలో మాత్రం చైతూ, సమంత మాట ఒక్కటే..
భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

