samantha and naga chaitanya divorce | సమంత నాగచైతన్య విడాకులు ( chai sam divorce ) గురించి చాలా రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సమంత, నాగ చైతన్య అధికారికంగా విడిపోయారు. ముందుగా తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా సమంత విడాకుల విషయం వెల్లడించింది. అధికారికంగా భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఎన్నో రోజుల తీవ్రమైన చర్చల తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయింది సమంత. ఇకపై భర్త నాగ చైతన్యతో తాను విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు అభిమానులతో అసలు విషయం పంచుకుంది. నాలుగేళ్ల వివాహ బంధం.. పదేళ్లకు పైగా అతనితో స్నేహం.. జీవితంలో తనకు ఎన్నో విషయాలు నేర్పించింది అని.. ఎప్పటికీ దానికి అతనికి రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేసింది సమంత.
ఇకపై ఈమె అక్కినేని కోడలు కాదనే విషయం తెలిసిన తరువాత.. అభిమానులు ఫీల్ అవుతున్నారు. దయచేసి తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు తమ నిర్ణయంపై ప్రైవసీ పాటించాలని కోరింది. నిజానికి చాలా రోజులుగా సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య విడిపోతున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరు స్పందించలేదు. దాదాపు మూడు నెలలుగా ఒకరికి ఒకరు దూరంగానే ఉంటున్నారు అని తెలుస్తోంది. అక్టోబర్ 6న వీళ్ల 4 వ వివాహ వార్షికోత్సవ వేడుక జరగనుంది.
దానికి నాలుగు రోజుల ముందే భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది సమంత. దీని వెనుక ఎన్నో రోజుల ఆలోచనల సమాహారం ఉంది అంటుంది ఈమె. అన్నీ ఆలోచించిన తర్వాత.. తమ దారులు కలవవు అని తెలిశాక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమంత తెలిపింది. ఇకపై కూడా తమ మధ్య స్నేహ భావం అలాగే కొనసాగుతుందని.. విడాకులు ఎలాంటి దూరాన్ని పెంచవని అభిమానులకు సూచించింది సమంత. అయితే దీనిపై నాగ చైతన్య ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. మొత్తానికి తండ్రి నాగార్జున మాదిరే నాగ చైతన్య కూడా విడాకుల బాట పట్టాడు. దీనికి వ్యక్తిగత కారణాలు చాలానే ఉన్నాయి. వీటి గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేదు అక్కినేని జంట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
chai sam divorce | మేం విడిపోతున్నం.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య, సమంత
Samantha: సమంతకు భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
Sri Reddy | సంసారంలో సరిగమలు సహజం..సమంతకు శ్రీరెడ్డి సూచన..వీడియో వైరల్
హైదరాబాదే నా ఇళ్లు.. నాకు అన్నీ ఇచ్చింది : సమంత
Samantha | హ్యాపీ మూడ్లో సమంత..ఈ స్పెషల్ వీడియో చూడండి
సమంతతో నటించాలని ఉందన్న బాలీవుడ్ స్టార్ హీరో..!