Samantha | హైదరాబాదే నా ఇళ్లు.. నాకు అన్నీ ఇచ్చింది : సమంత
ఏమాయ చేశావే (Ye Maaya Chesave) సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి..విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తోంది చెన్నై అందం సమంత (Samantha). సామ్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చేసిన చిట్ చాట్ సెషన్ లో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

ఏమాయ చేశావే (Ye Maaya Chesave) సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తోంది చెన్నై అందం సమంత (Samantha). నాగచైతన్య ((Naga Chaitanya)తో పెళ్లయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన జోష్ కొనసాగిస్తోంది. గతేడాది సాకి (Saaki) అనే క్లాత్ బ్రాండ్ ను కూడా షురూ చేసింది. ప్రస్తుతం సాకి మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా జరిపేందుకు ప్రణాళిక కూడా సిద్దం చేసినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సామ్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చేసిన చిట్ చాట్ సెషన్ లో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
మీరు ముంబైకు మకాం మారుస్తున్నారని విన్నాం..నిజమేనా..? అన్న ప్రశ్నకు సామ్ స్పందిస్తూ..ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ వందల కొద్దీ ఇతర పుకార్లలాగే ఇది నిజం కాదు. హైదరాబాదే ఎప్పటికీ నా ఇళ్లు. హైదరాబాద్ నాకు అన్నీ ఇచ్చింది. నేనిక్కడ నా జీవనాన్ని కొనసాగిస్తా. సాకి త్వరలోనే మెన్స్ వేర్ లో మంచి నాణ్యత కలిగిన దుస్తులను అందుబాటు ధరలో మీ ముందుకు తీసుకొస్తుందని తెలిపింది.
వ్యవస్థాపక రంగంలో మీ ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో ఏమైనా సవాళ్లు ఎదుర్కొన్నారా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..నేను ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య కరోనా సంక్షోభం. అప్పడు నేను ఒంటరిగా పనిచేయడం అలవాటు చేసుకున్నా. ప్రస్తుతం నేను టీంతో కలిసి పనిచేస్తున్నా. మొదట్లో భయంగా ఉండేది. మా టీంతో కలిసి చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకోగలిగాం. మాపై ప్రేమను చూపించి, మమ్మల్ని ప్రోత్సహించారు. ప్రతీ విషయంలో వందశాతం కష్టపడాలని నాకు తెలుసు. అదృష్టవశాత్తు నా బృందం కూడా అంతే కష్టపడిందంటూ చెప్పుకొచ్చింది సామ్.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

