పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని | జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో

అమరావతి : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో ఆయన టాలీవుడ్ సినీ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, బన్నీ వాసుతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నాని స్పందించారు. చిరంజీవి తనకు ఫోన్ చేశారని, సినిమా ఫంక్షన్ సంఘటనపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. పవన్ వ్యాఖ్యలతో మేం ఏకీభవించమని అన్నారని, సినిమా ఫంక్షన్లో జరిగిన పొరపాటుతో ఇండస్ట్రీకి సంబంధం లేదని అన్నారని చెప్పారు.
ఆన్లైట్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం కొత్త ప్రవేశపెట్టింది కాదని, సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఏకాభిప్రాయంగా తీసుకోబోమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కల్యాణేనని, రాజకీయ పార్టీని టెంట్‌హౌస్‌లా అద్దెకిస్తున్నారని విమర్శించారు.
అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమా రంగం చాలా సున్నితమైందన్నారు. సినీ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని, పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

