వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
Janasena Meeting | జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. కొన్నిరోజుల క్రితం ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ ఒక కవిత షేర్

అమరావతి: జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. కొన్నిరోజుల క్రితం ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ ఒక కవిత షేర్ చేసిన పవన్ కల్యాణ్.. అదే కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ నేతలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారాన్ని తాను నేర్పలేనని, నూనూగు మీసాలు కూడా రాని పదహారేళ్ల కుర్రాళ్లు నేర్పిస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు డబ్బు, అధికారం, మదం, మాత్సర్యం పుష్కలంగా ఉన్నాయని, భయం ఒక్కటే లేదని చెప్పిన ఆయన.. వారికి తాను కచ్చితంగా భయం నేర్పిస్తానని స్పష్టం చేశారు.
అలాగే నోటికొచ్చినట్లు అనాల్సినవన్నీ అనేసి, కులాల వెనుక దాక్కుంటే బయటకు లాక్కొచి కొడతానని హెచ్చరించారు. లేదంటే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం శిక్షలు పడేలా చేస్తానని చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తాను చాలా బాధ్యతగా ఉన్నానని, ఒక మాట కూడా తూలడం జరగలేదని అన్నారు. తాను బాపట్లలో పుట్టానని, తనకు బూతులు రాకపోవడం జరగదని చెప్పారు. తనకు నాలుగు భాషలు వచ్చని, ఏ భాషలోనైనా తిడతానని తెలిపారు. ఇంకా ఏదైనా భాషలో కావాలంటే నేర్చుకొని మరీ తిడతానని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

