Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో డిమాన్ పవన్, రీతూ చౌదరి ఎదురుపడినా పలకరింపులే లేవు.. వర్షిణిపై త్రిగుణ్ షాకింగ్ కామెంట్స్..!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మాజీ కంటెస్టెంట్ల సందడి కొనసాగుతోంది. 80వ రోజు ఎపిసోడ్లో పలువురు మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుత సభ్యులతో సందడి చేశారు. ముఖ్యంగా గత సీజన్లో మంచి స్నేహితులుగా, ప్రేమికులుగా గుర్తింపు తెచ్చుకున్న డిమాన్ పవన్, రీతూ చౌదరి ఒకే హౌస్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మాజీ కంటెస్టెంట్ల సందడి కొనసాగుతోంది. 80వ రోజు ఎపిసోడ్లో పలువురు మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుత సభ్యులతో సందడి చేశారు. ముఖ్యంగా గత సీజన్లో మంచి స్నేహితులుగా, ప్రేమికులుగా గుర్తింపు తెచ్చుకున్న డిమాన్ పవన్, రీతూ చౌదరి ఒకే హౌస్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇద్దరూ కలిసి రాకపోవడం, హౌస్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంగా ఉండటం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు టేస్టీ తేజ, శోభా శెట్టి ఎంట్రీతో ఎపిసోడ్ మరింత ఎంటర్టైనింగ్గా సాగింది.
గత సీజన్లో డిమాన్ పవన్, రీతూ చౌదరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించడంతో అప్పట్లో వీరి రిలేషన్ బాగా హైలైట్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతకాలం తమ బంధాన్ని కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఈ విషయాన్ని డిమాన్ పవన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తమ మధ్య పరిష్కారం కాని సమస్యలు, గొడవల కారణంగానే విడిపోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో గెస్ట్లుగా వీరిద్దరూ ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి వీరి రిలేషన్ చర్చకు వచ్చింది. అయితే డిమాన్, రీతూ కలిసి హౌస్‌లోకి రాకుండా ఒకరి తర్వాత ఒకరు ప్రవేశించారు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ కనీసం పలకరించుకోకపోవడం గమనార్హం. గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఇలా దూరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
హౌస్‌లో జరిగిన గేమ్‌లో డిమాన్ పవన్, దేబ్జానీ ఒక టీమ్‌గా పోటీపడగా, రీతూ చౌదరి, ముఖేష్ మరో టీమ్‌గా బరిలోకి దిగారు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. అయితే సంచాలకుడిగా త్రిగుణ్ సరిగ్గా నిర్ణయాలు తీసుకోలే దంటూ రీతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గేమ్ సమయంలో కొంత వాదన చోటుచేసుకుంది. చివరకు ఈ పోటీలో దేబ్జానీ, డిమాన్ పవన్ విజయం సాధించారు. ఈ విజయంతో దేబ్జానీకి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచే అవకాశం లభించింది. ఆ సంతోషంలో దేబ్జానీ తన దగ్గర దాచుకున్న టీషర్ట్‌ను డిమాన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ సన్నివేశం హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
డిమాన్, రీతూ సందడి తర్వాత మాజీ కంటెస్టెంట్లు శోభా శెట్టి, టేస్టీ తేజ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ హౌస్‌మేట్స్‌తో సరదాగా మాట్లాడటంతో పాటు ఒక ఆసక్తికరమైన ఫ్రెండ్షిప్ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో ప్రతి కంటెస్టెంట్ తమకు హౌస్‌లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పి వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇవ్వాలి. అదే సమయంలో ఎవరితో స్నేహం కొనసాగించకూడదని భావిస్తున్నారో వారికి బ్యాండ్ తొడిగి దానిని కట్ చేయాలి. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఉన్న స్నేహాలు, మనసులోని అభిప్రాయాలు బయటపడ్డాయి.
ఈ ఫ్రెండ్షిప్ టాస్క్‌లో త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. తన బెస్ట్ ఫ్రెండ్‌గా వంశీకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చాడు. అదే సమయంలో వర్షిణి విషయంలో మాత్రం తన అసంతృప్తిని బయటపెట్టాడు. వర్షిణితో ఇకపై స్నేహం చేయకూడదనుకుంటున్నానని చెబుతూ, ఆమె తనకు మిత్రద్రోహం చేసిందని ఆరోపించాడు. ఆమె బయటకు వెళ్లిన తర్వాత అయినా తనకు సారీ చెబుతుందేమో చూడాలని వ్యాఖ్యానించాడు. అనంతరం వర్షిణికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తొడిగి దానిని కట్ చేశాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో డిమాన్ పవన్, రీతూ చౌదరి ఎదురుపడినా పలకరింపులే లేవు.. వర్షిణిపై త్రిగుణ్ షాకింగ్ కామెంట్స్..!
SIR | బర్త్ సర్టిఫికెట్‌కూ ఎసర్..! తండ్రి పేరు ఓటరు జాబితాలో లేదని చిన్నారికి జనన ధ్రువీకరణ నిరాకరణ
UP | యూపీలో కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్.. చర్చలు కొనసాగుతుండగానే ఐదు సీట్లకు అభ్యర్థుల ప్రకటన
Allu Arjun | వేగం పెంచాల్సిందే..! ‘రాకా’ చిత్రీకరణలో బిజీగా అల్లు అర్జున్
Shraddha Kapoor | ఈథా కోసం కఠోర సాధన
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

