ఈథా కోసం కఠోర సాధన
తమాషా, లావణీ వంటి నృత్యరీతుల ద్వారా ప్రసిద్ధికెక్కిన మహారాష్ట్ర జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘ఈథా’ చిత్రంలో శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తమాషా, లావణీ వంటి నృత్యరీతుల ద్వారా ప్రసిద్ధికెక్కిన మహారాష్ట్ర జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘ఈథా’ చిత్రంలో శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్ ప్రత్యేకంగా సంప్రదాయ నృత్యరీతుల్ని నేర్చుకున్నది. ఒక్కోపాట కోసం 25రోజుల పాటు కఠోర సాధన చేసిందని చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ చెప్పారు. ఇటీవల జరిగిన ‘జీ జీ రే జీ’ పాట విడుదల సందర్భంగా ఆయన ఈ విషయాల్ని పంచుకున్నారు. ‘రెండు కాళ్లకు దాదాపు నాలుగు కిలోల బరువున్న గజ్జెలను కట్టుకొని ఎనిమిది గంటల పాటు నాన్‌స్టాప్‌గా ప్రాక్టీస్ చేసేది.
అంత బరువుతో నృత్యం చేయడం వల్ల ఆమె పాదాలు వాచిపోయి కనిపించేవి. తమాషా, లావణి వంటి కళారూపాల్ని లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు విఠాబాయి పాత్రలో పరకాయప్రవేశం చేసింది. పాట చిత్రీకరణ రెండో రోజు ఆమె కండరాలకు గాయం కావడంతో షూటింగ్‌ను నిలిపివేశాం. ఆ గాయం కారణంగా శ్రద్ధాకపూర్ కన్నీళ్లు పెట్టుకుంది. నెలరోజుల వ్యవధిలోనే ఆమె పూర్తిగా కోలుకొని సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ పాత్రలో శ్రద్ధాకపూర్‌ని తప్ప మరొకరిని ఊహించలేం’ అని లక్ష్మణ్ ఉటేకర్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

